ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మా ప్రభుత్వం రుణమాఫీ ఎందుకు చేయాలి?: అంబటి

రుణమాఫీ బాధ్యత తమది కాదని వైకాపా నేత అంబటి రాంబాబు అన్నారు. ఐదేళ్ల పాలనలో హామీని నెరవేర్చలేని తెదేపా నేతలు ఇప్పుడు విమర్శలు చేయటం సిగ్గు చేటని మండిపడ్డారు.

By

Published : Sep 26, 2019, 11:19 PM IST

అంబటి

మీడియా సమావేశంలో అంబటి రాంబాబు

అవినీతిని అరికట్టి ప్రజాధనాన్ని ఆదా చేసేందుకు సీఎం పరితపిస్తూ రివర్స్ టెండరింగ్ సహా పలు చర్యలు తీసుకుంటుంటే చంద్రబాబు నాయుడు ఓర్వలేకపోతున్నారని వైకాపా విమర్శించింది. ప్రభుత్వంపై చంద్రబాబు బురదజల్లుతున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. వైకాపా ప్రభుత్వాన్ని కాలకేయ ప్రభుత్వమని, అరాచకపాలన ఉందని చంద్రబాబు పదెేపదే చెబుతూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. పీపీఏల్లో చంద్రబాబు, లోకేశ్​ అవినీతికి పాల్పడి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. 5 ఏళ్ల పాలనలో రైతులందరికీ రుణమాఫీ చేయటంలో చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారని అన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన రుణమాఫీని తమ ప్రభుత్వం ఎందుకు అమలు చేయాలని ప్రశ్నించారు. గ్రామ సచివాలయం ఉద్యోగాల పరీక్ష పేపర్లు లీకయ్యాయని దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహించారు. ఏ రాష్ట్రంలో లేని రీతిలో లక్షన్నర ఉద్యోగాలు భర్తీ చేస్తుంటే ఒర్వలేకే ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. పోలవరం, పీపీఏలపై ఎంపీ సుజనా చౌదరి చేస్తోన్న ఆరోపణలన్నీ అవాస్తవాలేని కొట్టివేశారు.

ABOUT THE AUTHOR

...view details