అమరావతికి మద్దతుగా హైకోర్టులో భాజపా అఫిడవిట్ దాఖలు చేయాలని.. రాజధాని రైతులు డిమాండ్ చేశారు. అప్పుడే ఆ పార్టీపై నమ్మకం కలుగుతుందన్నారు. 3 రాజధానుల ఏర్పాటుకు వ్యతిరేకంగా.. అమరావతి గ్రామాల్లో 280 రోజూ ఆందోళనకు దిగారు.
కృష్ణాయపాలెం, తుళ్లూరు, మందడం, వెలగపూడి, ఉద్దండరాయునిపాలెంలో.. రోడ్డుపై నిరసన తెలియజేశారు. అమరావతికి మద్దతు ప్రకటించిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చిత్రపటానికి.. పాలాభిషేకం చేశారు.