రాష్ట్ర రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ ఇండియా మ్యాప్ విడుదలైంది. కేంద్ర హోంశాఖ ఆదేశాలతో మ్యాప్‌లో సర్వే ఆఫ్ ఇండియా సవరణలు చేసింది. జమ్మూ కశ్మీర్‌కి రాష్ట్ర హోదా రద్దవటంతో భారత్‌లో రాష్ట్రాల సంఖ్య 28కి చేరింది. మరోవైపు కేంద్ర పాలిత ప్రాంతాల సంఖ్య తొమ్మిదికి చేరింది. ఈ క్రమంలో భారత్‌లోని 28 రాష్ట్రాలు, 9 కేంద్ర పాలిత ప్రాంతాలను గుర్తిస్తూ భారత ప్రభుత్వం ఈ నెల మొదట్లో కొత్త ఇండియా మ్యాప్‌ను విడుదల చేసింది. ఇందులో దేశంలోని అన్ని రాష్ట్రాలు, రాజధానుల్ని గుర్తించారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని అందులో ప్రస్తావించలేదు. ఈ వ్యవహారం కాస్త చర్చనీయాంశంగా మారింది. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఈ విషయాన్ని పార్లమెంట్లో ప్రస్తావించారు. ఏపీ రాజధానిగా అమరావతి లేని మ్యాప్‌ను విడుదల చేయటం ఏంటని ప్రశ్నించారు. ఈ క్రమంలో కేంద్ర హోంశాఖ ఆదేశాలతో మ్యాప్‌లో సర్వే ఆఫ్ ఇండియా సవరణలు చేసి నూతన మ్యాప్‌ను ఇవాళ విడుదల చేసింది.
రాష్ట్ర రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ మ్యాప్ విడుదల - మ్యాప్ వివాదం అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ సర్వే ఆఫ్ ఇండియా సరికొత్త మ్యాప్‌ను విడుదల చేసింది. అమరావతి లేని మ్యాప్‌ను విడుదల చేస్తారా అంటూ పార్లమెంటులో ఎంపీలు గళం విప్పటంతో మ్యాప్‌ను సవరించింది.
అమరావతి