ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'బిల్లును ఆమోదిస్తే.. భూములు ఇచ్చిన రైతులు నట్టేట మునిగిపోతారు' - అమరావతి ఐక్య కార్యాచరణ సమితి వార్తలు

రాజధాని విషయంలో వైకాపా ప్రభుత్వం రాజ్యాంగ విరుద్దంగా వ్యవహరిస్తుందని..అమరావతి ఐక్య కార్యాచరణ సమితి ప్రతినిధులు ఆరోపించారు. వాస్తవ పరిస్థితి తెలుసుకునేందుకు రాష్ట్ర గవర్నర్‌ స్వతంత్ర కమిటీతో వివరాలు సేకరించి.. బిల్లులను రాష్ట్రపతికి పంపాలని కోరారు.

amaravathi
amaravathi

By

Published : Jul 21, 2020, 5:36 PM IST

విజయవాడలోని సమితి కార్యాలయంలో అమరావతి ఐక్య కార్యాచరణ సమితి ప్రతినిధులు సమావేశమయ్యారు. రైతులు చేసిన త్యాగాలను ప్రభుత్వ ప్రతినిధులు అవమానిస్తూ.. అవహేళన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 217 రోజులుగా మహిళలు, రైతులు ఆందోళన చేస్తున్నా.. ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందన్నారు. ఈ బిల్లులను ఆమోదిస్తే.. భూములు ఇచ్చిన రైతులు నట్టేట మునిగిపోతారన్నారు.

ప్రభుత్వం వాస్తవ పరిస్థితి తెలుసుకోకుండా ఓ కులం పేరుతో కర్షకులను కష్టపెడుతోందన్నారు. 29వేల కుటుంబాలు భూములు ఇస్తే.. ఓ సామాజిక వర్గం పేరుతో బురద జల్లుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతిని పరిపాలనా రాజధానిగా కొనసాగించాలి తప్ప.. కుట్రపూరితంగా శాసన రాజధానిగా ఉంచుతామనడం సరికాదన్నారు.

ఇదీ చదవండి:'వైరస్ వ్యాప్తి కేంద్రాలుగా.. కోవిడ్ పరీక్షా కేంద్రాలు'

ABOUT THE AUTHOR

...view details