ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ రైతులు చేస్తున్న ఉద్యమం 270వ రోజుకి చేరింది. కృష్ణాయపాలెం, మందడం, వెలగపూడి, ఐనవోలు, ఉద్దండరాయునిపాలెంలో రైతులు ఆందోళన చేశారు. అమరావతి కోసం ఎంపీ పదవికి రాజీనామా చేస్తానన్న రఘురామకృష్ణరాజు చిత్రపటానికి ఉద్దండరాయునిపాలెం శిబిరం వద్ద రైతులు, మహిళలు క్షీరాభిషేకం చేశారు. రాజధాని కోసం తమతో సంబంధం లేని వ్యక్తి పదవిని వదులుకోవడానికి సిద్ధపడితే... తమ గ్రామంలో పుట్టిన ఎంపీ మూడు రాజధానులకు మద్దతు తెలపడాన్ని మహిళలు తప్పుపట్టారు. పోలీసు బందోబస్తుతో సచివాలయానికి వెళ్లడం ధైర్యం కాదని... అరెస్టు లు చేసినా ఉద్యమం కొనసాగిస్తున్నామని రైతులు చెప్పారు.
వైకాపా ఎంపీ చిత్రపటానికి అమరావతి రైతుల క్షీరాభిషేకం
అమరావతి రైతుల దీక్షకు 270వ రోజుకు చేరుకున్నాయి. అమరావతి కోసం ఎంపీ పదవికి రాజీనామా చేస్తానన్న రఘురామకృష్ణరాజు చిత్రపటానికి ఉద్దండరాయునిపాలెం శిబిరం వద్ద రైతులు క్షీరాభిషేకం చేశారు.
ఎంపీ రఘురామరాజు చిత్రపటానికి అమరావతి రైతుల పాలాభిషేకం