ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవికి అమరావతి సెగ - ఏపీ రాజధాని న్యూస్

గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవీకి అమరావతి రైతుల ఆందోళన సెగ తగిలింది. తుళ్లూరులో జగనన్న విద్యాకానుక కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న ఎమ్మెల్యేను...గో బ్యాక్​, గో బ్యాక్ అంటూ రైతులు, మహిళలు నినాదాలు చేశారు. తమను కించ పరిచేలా మాట్లాడిన ఎమ్మెల్యే శ్రీదేవీ క్షమాపణలు చెప్పాకే అమరావతిలో అడుగుపెట్టాలని డిమాండ్​ చేశారు.

తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవీకి అమరావతి నిరసన సెగ
తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవీకి అమరావతి నిరసన సెగ

By

Published : Oct 8, 2020, 7:19 PM IST

గుంటూరు జిల్లా తుళ్లూరులో జగనన్న విద్యా కానుక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన తాడికొండ శాసనసభ్యురాలు ఉండవల్లి శ్రీదేవికి అమరావతి రైతుల ఆందోళనల సెగ తగిలింది. శాసన సభ్యురాలు ఈ కార్యక్రమానికి వెళ్లేముందు, ముగించుకుని వెళ్తునప్పుడూ రైతులు, మహిళలు గోబ్యాక్..... గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.

తమను పెయిడ్ ఆర్టిస్టులుగా అభివర్ణించిన శాసనసభ్యురాలు క్షమాపణలు చెప్పిన తర్వాతే అమరావతిలో పర్యటించాలని రైతులు నినాదాలు చేశారు. శ్రీదేవి కాన్వాయ్​ను అడ్డుకునేందుకు యత్నించిన రైతులు, మహిళలను పోలీసులు రోడ్డు పైకి రాకుండా నిలువరించారు. తమ ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే తమనే కించపరచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

ABOUT THE AUTHOR

...view details