54వ రోజు అమరావతి రైతుల ఆందోళనలు - ఏపీ రాజధాని రైతుల ఆందోళనలు
అమరావతి రైతుల ఆందోళనలు 54వ రోజుకు చేరాయి. రైతుల ద్విచక్రవాహన ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించినందున.. శిబిరాల్లోనే నిరసన దీక్షలు చేయనున్నారు. మందడం, తుళ్లూరులో ధర్నాల్లో రైతులు పాల్గొననున్నారు. వెలగపూడి, మందడంలో 24 గంటల దీక్ష చేయనున్నారు. కృష్ణాయపాలెం, ఎర్రబాలెం, ఐనవోలు, నవులూరు గ్రామాల్లో నిరసనలు చేపట్టనున్నారు.
ఆందోళన చేస్తున్న అమరావతి రైతులు