Welcome: రాజధాని ప్రాంతం రాయపూడి సీడ్ యాక్సిస్ రహదారి సమీపంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల భవనాల వద్ద నిర్మాణ పనులను తిరిగి ప్రారంభించిన ఎన్‌సీసీ సంస్థ కార్మికులకు అమరావతి రైతులు గులాబీ పూలు అందించి స్వాగతం పలికారు. మైనార్టీ ఐకాస కన్వీనర్ షేక్ సాహెబ్‌జాన్, దళిత ఐకాస నాయకుడు చిలకా బసవయ్య ఆధ్వర్యంలో రైతులు కార్మికుల వద్దకు వెళ్లి స్వాగతం పలికారు. ఉద్యమం ఫలితంగానే నిర్మాణ పనులు తిరిగి ప్రారంభమయ్యాయని వారు పేర్కొన్నారు.
అమరావతిలో రాజధాని పనులు పునఃప్రారంభం.. గులాబీలిచ్చి స్వాగతం - కార్మికులకు గులాబీలు ఇస్తోన్న అమరావతి రైతులు
Welcome: అమరావతిలో భవనాల పనులు పునఃప్రారంభమయ్యాయి. రాయపూడి సీడ్ యాక్సిస్ రహదారి సమీపంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల భవనాల వద్ద నిర్మాణ పనులను తిరిగి ప్రారంభించిన కార్మికులకు అమరావతి రైతులు గులాబీ పూలు అందించి స్వాగతం పలికారు.
రాజధాని నిర్మాణం పూర్తై రాష్ట్ర భవిష్యత్తుకు, యువత ఉపాధికి అమరావతి దిక్సూచిగా మారేవరకు పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. న్యాయస్థానం తీర్పుతోనే పనులు పునఃప్రారంభించినట్లు భావిస్తున్నామని చెప్పారు. రైతుల ఫ్లాట్ల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించి, చిత్తశుద్ధిని చాటుకోవాలని పేర్కొన్నారు. అమరావతి రైతులు, మహిళలు చేస్తున్న నిరసనలు 859వ రోజుకు చేరుకున్నాయి. వెలగపూడి, ఉద్దండరాయునిపాలెం, మందడం, వెంకటపాలెం తదితర గ్రామాల్లో దీక్షలు కొనసాగాయి.