ఒకే రాజధాని కోసం అమరావతి పరిరక్షణ ఐకాస నాయకులు.. దిల్లీలో కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసి ప్రయత్నాలు చేస్తుండగా.... అమరావతిలో రైతుల పోరాటం 50వ రోజుకి చేరింది. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ మందడంలో 24 గంటల దీక్ష ఏడో రోజుకు చేరింది. తుళ్లూరు, వెలగపూడిల్లో రైతులు నిరసనలు కొనసాగిస్తున్నారు. వైకాపా సర్కార్ అన్నదాతల పట్ల ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోందని అమరావతి గ్రామాల రైతులు ఆరోపించారు. రాజధాని రైతుల సమస్యలు పరిష్కరిస్తామని చెబుతూనే 3 రాజధానుల ప్రతిపాదనను కొనసాగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధించినా రాజధానిని కొనసాగించే ప్రకటన వచ్చే వరకు పోరు ఆపేదిలేదని రైతులు తేల్చి చెప్పారు.
50వ రోజుకు అమరావతి ఆందోళనలు
రాజధాని రైతుల ఆందోళనలు 50వ రోజుకు చేరుకున్నాయి. అమరావతి మద్దతు కూడగట్టేందుకు ఐకాస నేతలు కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. మరోవైపు రాజధాని రైతులు నిరసనలు కొనసాగిస్తున్నారు. వైకాపా సర్కార్ రాజధానిని తరలించమని చెబుతూనే... 3 రాజధానుల ప్రతిపాదన కొనసాగిస్తుందని రైతుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
50వ రోజుకు అమరావతి ఆందోళనలు