అమరావతి కోసం ఆగిన మరో రైతు గుండె - అమరావతి రైతు మృతి న్యూస్
అమరావతి కోసం మరో రైతు బలయ్యాడు. నిన్నటి వరకూ ఉద్యమంలో పాల్గొన్న అన్నదాత గుండెపోటుతో నేలకొరిగాడు.
అమరావతి కోసం ఆగిన మరో రైతు గుండె
అమరావతి రాజధాని ఉద్యమం 220 రోజులకు పైగా సాగుతోంది. ఆశల రాజధాని కోసం భూములిచ్చిన రైతులు.. కొత్త రాజధాని ప్రతిపాదనతో తీరని శోకానికి గురయ్యారు. ఉద్యమంలో పాల్గొని ఇప్పటికే కొందరు అమరులయ్యారు. మూడు రాజధానుల ప్రతిపాదనకు గవర్నర్ రాజముద్ర వేసిన కొద్దిరోజుల్లోనే మరో రైతు ప్రాణాలొదిలాడు. నిన్నటి వరకూ ఉద్యమంలో పాల్గొన్న నీరుకొండకు చెందిన నన్నపనేని వెంకటేశ్వరరావు గుండెపోటుతో మృతి చెందాడు. అన్నదాత మృతితో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Last Updated : Aug 2, 2020, 4:18 PM IST