ఎస్సీలకు రాజధాని ఉద్యమంతో సంబంధం లేదంటూ వైకాపా శాసన మండలి సభ్యులు డొక్కా మాణిక్యవరప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై అమరావతి ఎస్సీ ఐకాస నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ నియోజకవర్గంలో రెండుసార్లు శాసనసభ్యులుగా గెలిచిన డొక్కా మాణిక్య వరప్రసాద్‌కు..రాజధాని ప్రాంతంలో వెనకబడిన వర్గాలు ఉన్నారన్న సంగతి తెలియదా అని నిలదీశారు.
డొక్కా మాణిక్యవరప్రసాద్ గారూ.. అమరావతిలో వెనకబడిన వర్గాలు లేవా? - డొక్కా మాణిక్య ప్రసాద్‌పై వార్తలు
ఎస్సీలకు రాజధాని ఉద్యమంతో సంబంధం లేదంటూ వైకాపా శాసన మండలి సభ్యులు డొక్కా మాణిక్యవరప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై అమరావతి దళిత ఐకాస నేతలు స్పందించారు. రాజధాని ప్రాంతంలో వెనకబడిన వర్గాలు లేవా అని ప్రశ్నించారు.
గతంలో అమరావతి ఉద్యమానికి మద్దతు తెలిపిన ఎమ్మెల్సీ సభ్యులు మాణిక్య వరప్రసాద్ పార్టీ మారగానే ఇలా వ్యాఖ్యానించడం తగదని హితవు పలికారు. ఎస్సీ రైతుల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సింది పోయి.. తమను అవమానపరిచే లాగా మాట్లాడటం తగదన్నారు. రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేశారని ఎస్సీ ఐకాస నేతలు చెప్పారు. ప్రభుత్వం ఇప్పటివరకు కౌలు చెల్లించలేదని.. ప్లాట్ల అభివృద్ధికి చర్యలు తీసుకోలేదని.. రైతులతో సమాన ప్యాకేజీ ఇస్తామన్న ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యలు ఏమయ్యాయని ఐకాస నేతలు నిలదీశారు.
ఇదీ చదవండి: వరద బాధితులకు రూ.2 వేలు సాయం: సీఎం జగన్