సీఎం జగన్ కు అమరావతి రైతుల నిరసన సెగ తగిలింది. సీఎం సచివాలయం వెళ్తుండగా అమరావతి రైతులు జగన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తుళ్లూరు మండలం మందడం రైతులు, మహిళలు శిబిరం బయట నిలబడి జెండాలు పట్టుకుని సీఎం కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినదించారు. ముఖ్యమంత్రికి రైతులు కనిపించకుండా పోలీసులు అడ్డుగా నిలబడ్డారు.
ముఖ్యమంత్రి జగన్కు రాజధాని రైతుల నిరసన సెగ - అమరావతి రైతుల ఆందోళన
ముఖ్యమంత్రి జగన్కు రాజధాని రైతుల సెగ తగిలింది. సీఎం కాన్వాయ్ సచివాలయం వైపునకు వెళ్తుండగా మందడం వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
amaravarthi protest at cm convoy