విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిర్ణయం ఒడిశా నేతల కుట్రేనని వైకాపా నేతలు ఆరోపించారు. ప్రైవేటీకరణపై వివిధ పార్టీలు, ఉద్యోగ సంఘాలతో మంత్రి అవంతి శ్రీనివాస్, ఎంపీ విజయసాయిరెడ్డి చర్చించారు.
రాజకీయం చేయెుద్దు: అవంతి
స్టీల్ ప్లాంట్ అంశాన్ని ప్రతిపక్షాలు రాజకీయం చేయొద్దని మంత్రి అవంతి శ్రీనివాసరావు చెప్పారు. కేంద్ర ఉక్కుశాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్.. ఒడిశాకు చెందినవారు కావడం దురదృష్టకరమని మంత్రి అన్నారు. ఉక్కు ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం తమ ప్రభుత్వాన్ని సంప్రదించలేదని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసే ఇదంతా జరుగుతుందనే ప్రచారం దుర్మార్గమని ఆక్షేపించారు. ఈ విషయంలో లాలూచీ పడ్డారనే ఆరోపణలను నూటికి నూరుపాళ్లు అవాస్తవమని చెప్పారు.