ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'అక్కను పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారో తెలియదు'

అఖిలప్రియను పోలీసు ఎందుకు అరెస్ట్ తీసుకున్నారో తనకు తెలియదని ఆమె సోదరి మౌనిక రెడ్డి తెలిపారు. సోదరిని కలిసేందుకు బేగంపేటకు వచ్చిన ఆమెకు అనుమతి లభించలేదు. ఆహారం, మందులను మాత్రమే లోపలికి పంపించారు.

akhilapriya-sister-mounika-reddy
akhilapriya-sister-mounika-reddy

By

Published : Jan 6, 2021, 3:29 PM IST

Updated : Jan 6, 2021, 4:34 PM IST

అఖిల ప్రియను కలిసేందుకు బేగంపేటలోని లెర్నింగ్​ సెంటర్​కు వచ్చానని ఆమె సోదరి మౌనిక రెడ్డి చెప్పారు. తన సోదరి ఆరోగ్యం బాగోలేనందున మందులు, ఆహారం తీసుకొచ్చానని తెలిపారు. కానీ పోలీసులు తనను లోనికి అనుమతించలేదన్నారు. కేవలం ఆహారం, మందులు లోనికి తీసుకెళ్లారని పేర్కొన్నారు.

బోయిన్​పల్లి కిడ్నాప్​ వ్యవహారంలో ఏపీ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియను కూకట్​పల్లిలోని ఆమె నివాసంలో పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆమెను బేగంపేటలోని లెర్నింగ్​ సెంటర్​కు తీసుకెళ్లారు. అఖిల ప్రియ భర్త భార్గవరామ్​ పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. అఖిలప్రియకు గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు.

Last Updated : Jan 6, 2021, 4:34 PM IST

ABOUT THE AUTHOR

...view details