తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లా అక్కన్నపేటలో అర్ధరాత్రి కాల్పుల కలకలం కలవర పెట్టింది. మూడురోజుల క్రితం ఇటుకల విషయంలో గంగరాజు, సదానందం అనే ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ జరిగింది. మాటా మాటా పెరగటంతో గంగరాజు ఇంట్లోకి వెళ్లి సదానందం ఏకే47తో కాల్పులు జరిపాడు. కాల్పుల చప్పుడు విన్న గంగరాజు అప్రమత్తమయ్యి త్రుటిలో తప్పించుకున్నాడు. కాల్పుల జరిపిన అనంతరం సదానందం అక్కడ నుంచి పరారయ్యాడు.
ఇటుకల వివాదం..ఏకే 47తో కాల్పులు - సిద్ధిపేటలో ఏకే 47తో కాల్పులు
ఇద్దరి మధ్య ఇటుకల విషయంలో గొడవయ్యింది. వివాదం ముదిరి ఓ వ్యక్తి ఏకంగా ఏకే 47తో కాల్పులు జరిపాడు. ఇదంతా ఎక్కడో అమెరికాలో కాదు జరిగింది... తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణాలో....!
అర్ధరాత్రి కాల్పుల కలకలం
అర్ధరాత్రి తుపాకి కాల్పుల శబ్దాలు రావటంతో గ్రామస్తులు ఉలిక్కి పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని, సదానందానికి ఏకే47 ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై ఆరా తీస్తున్నారు. పరారీలో ఉన్న సదానందం కోసం గాలిస్తున్నారు. నిందితుడి కుటుంబసభ్యులను పోలీసులు విచారిస్తున్నారు.
ఇదీ చదవండి:ఎయిరిండియాకు ప్రముఖుల ప్రయాణాల భారం