ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

6 నుంచి 9 తరగతులకు పరీక్షలు రద్దు: ఆదిమూలపు సురేష్

రాష్ట్రంలో పరీక్షల నిర్వహణ, మధ్యాహ్న భోజన పథకంపై సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఈ విద్యా సంవత్సంలో 6 నుంచి 9 తరగతుల వరకూ పరీక్షలు లేకుండా హాజరు ఆధారంగా ప్రమోట్ చేస్తున్నామని తెలిపారు. గోరుముద్దలు పథకం కింద విద్యార్థులకు డ్రై రేషన్ ఇంటికే పంపిస్తామని తెలిపారు. పది పరీక్షల నిర్వహణపై ఈ నెల 31 అనంతరం నిర్ణయం తీసుకుంటామన్నారు.

ఆదిమూలపు సురేష్
ఆదిమూలపు సురేష్

By

Published : Mar 26, 2020, 1:57 PM IST

Updated : Mar 26, 2020, 2:39 PM IST

పరీక్షల నిర్వహణపై మంత్రి ఆదిమూలపు సురేష్

జగనన్న గోరుముద్దలు పథకం (మధ్యాహ్న భోజనం) కింద విద్యార్థులకు ఇంటి వద్దకే పౌష్టికాహారం అందించాలని సీఎం ఆదేశించారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. కరోనా ప్రభావంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. విద్యార్థులకు డ్రై రేషన్ 10 రోజులకు అవసరమైన మొత్తం ఇస్తున్నామన్నారు. ఏప్రిల్ 14 వరకూ డ్రై రేషన్​ అందిస్తామన్నారు. డ్రై రేషన్​ను గ్రామ వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థ ద్వారా ఇంటికే అందిస్తామన్నారు. వచ్చేనెల 14 తర్వాత పాఠశాలలు తెరిచే అవకాశం ఉంటుందన్నారు. ఇప్పటికే 1 నుంచి 5వ తరగతులకు వార్షిక పరీక్షలు నిర్వహించామన్న ఆయన.. ఈ నెల 31 జరిగే సమీక్ష అనంతరం పది పరీక్షల తేదీలు ప్రకటిస్తామన్నారు. హాజరు ఆధారంగా 6-9 తరగతి వరకు పరీక్షలు లేకుండా ప్రమోట్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

Last Updated : Mar 26, 2020, 2:39 PM IST

ABOUT THE AUTHOR

...view details