ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Chikki with CM photo: చిక్కీలపై సీఎం బొమ్మ...ప్రభుత్వంపై అధిక భారం - ఏపీ లేటెస్ట్​ అప్​డేట్స్​

Chikki with CM photo: పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో అందించే చిక్కీలపై... సీఎం బొమ్మ ముద్రించడంతో ప్రభుత్వానికి అదనపు భారం పడింది. 25గ్రాముల బరువు ఉండే ఒక్కో చిక్కీని.. సీఎం బొమ్మతో ఉండే కవర్‌లో విడివిడిగా ప్యాకింగ్‌ చేసేందుకు.. 11 కోట్లకుపైగా ఖర్చు చేస్తున్నారు. గతేడాదితో పోల్చితో కిలో చిక్కీపై రూ.12 పెరిగినట్లు అధికారులు చెబుతు‌న్నారు.

Chikki with CM photo
చిక్కీలపై సీఎం బొమ్మ

By

Published : Mar 31, 2022, 5:55 PM IST

Chikki with CM photo: ప్రభుత్వ, ఎయిడెడ్‌ బడుల్లో చదివే విద్యార్థులకు వారానికి మూడు రోజుల చొప్పున ఒక్కొక్కరికి 25గ్రాముల చిక్కీలను అందిస్తున్నారు. గతేడాది వరకు కిలో చిక్కీని ఒకటే ప్యాకింగ్‌తో పాఠశాలలకు అందించేవారు. ఈ ఏడాది ఈ విధానంలో మార్పు చేసి.... ఒక్కో విద్యార్థికి విడిగా ప్యాకింగ్‌తో అందించేలా టెండర్లు పిలిచారు. గతేడాది చిక్కీల టెండర్లను నాలుగు జోన్లుగా నిర్వహించారు. కిలోకు సరాసరిన 146 చెల్లించగా.. ఈ ఏడాది ఆ ధర కాస్తా 158 రూపాయలకు పెరిగింది.

చిక్కీలపై సీఎం బొమ్మ

గతేడాది 25గ్రాముల చిక్కీకి సరాసరిన 3 రూపాయల 65 పైసలు చొప్పున చెల్లించగా.. ఈ ఏడాది 3.95 రూపాయలు వెచ్చిస్తున్నారు. విడివిడిగా ప్యాకింగ్‌ చేయడంతో 30పైసలు ధర పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. గతేడాది కిలో టెండర్‌ విలువ 135 రూపాయలుగా నిర్ణయించగా.. ఈసారి 150కి పెంచి టెండర్లు పిలిచారు.

రాష్ట్రంలో మధ్యాహ్న భోజనం తినే విద్యార్థులు 42.94లక్షల మంది ఉన్నారు. వీరిలో ప్రతి రోజు 85శాతం పిల్లలు బడికి హాజరవుతుండగా.. వారిలో సరాసరిన 91.5శాతం అంటే.. 33 లక్షల 39 వేల 659 మంది భోజనం తింటున్నారు. వీరికి వారానికి మూడు రోజులు చిక్కీలను అందిస్తున్నారు. ఏడాదికి 220రోజులకు పైగా పాఠశాలలు పని చేస్తుండగా.. వారానికి మూడు రోజుల చొప్పున సుమారు 110 రోజులు విద్యార్థులకు చిక్కీలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఒక్క విద్యా సంవత్సరంలోనే సీఎం బొమ్మతో ప్యాకింగ్‌ చేసి ఇచ్చేందుకు 11.02కోట్లు వ్యయమవుతోందని అంచనా.

ఇదీ చదవండి: 'నేరచరిత్ర ఉన్నవారిని తితిదే బోర్డు సభ్యులుగా నియమిస్తారా ?'.. ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం

ABOUT THE AUTHOR

...view details