ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాతే చాలా మంది నటనను కెరీర్‌గా ఎంచుకున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. నటుడు అలీ ఈ స్థాయికి చేరుకోవడానికి ఎంతో కష్టపడ్డారన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో హాస్యనటుడు అలీ 40 ఏళ్ల సినీ జీవిత మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అలీకి సన్మానోత్సవం చేశారు. పేద కుటుంబంలో పుట్టిన అలీ కష్టపడి, అంచలంచెలుగా ఎదిగి ఈ స్థాయికి చేరుకున్నారని సీఎం కొనియాడారు. అన్ని తరాల నటులకు ఆయనే స్పూర్తి అన్నారు. సినిమాల్లో హీరో ఎంత ముఖ్యమో హాస్య నటులు అంతే ముఖ్యమన్నారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీప్రముఖులు హాజరయ్యారు.
అలీ నేటి తరానికి స్ఫూర్తి: సీఎం
నేటి తరం నటులకు హాస్యనటుడు అలీ స్ఫూర్తిదాయకమని అని సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అలీ 40 ఏళ్ల సినీ జీవిత మహోత్సవాన్ని నిర్వహించారు.
హాస్యనటుడు అలీ 40 ఏళ్ల సినీ జీవిత మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు.