హిందూ దేవాలయాలపై జరుగుతున్న వరుస దాడులను తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్రంగా ఖండించారు. టీవీలు, ప్రజల ముందు దేవుని దయతో అని చెప్పటం కాకుండా.. దేవుళ్లకు జరుగుతున్న అవమానాలపై జగన్ మాట్లాడాలన్నారు. రామతీర్థం ఘటన మరువక ముందే.. రాజమహేంద్రవరంలో విష్నేశ్వరాలయలోని సుబ్రమణ్యేశ్వర స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
జగన్ పాలనలో ప్రజలకే కాదు... దేవుళ్లకూ రక్షణ లేదు: అచ్చెన్న
రామతీర్థం ఘటన మరువక ముందే.. రాజమహేంద్రవరంలోని హిందూ దేవుని విగ్రహం ధ్వంసం కావటాన్ని... తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్రంగా ఖండించారు. జగన్ పరిపాలనలో దేవుళ్లకు సైతం రక్షణ లేదని ధ్వజమెత్తారు.
అచ్చెన్న
అహంకారాన్ని వీడకపోతే దేవుడే మదాన్ని అణగదొక్కుతారని అచ్చెన్న హెచ్చరించారు. రాష్ట్రంలో ఎన్నడూ ఇటువంటి సంస్కృతి లేదని అన్నారు. జగన్ పాలనలో ప్రజలకే కాకుండా.. దేవుళ్లకు సైతం రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. దేవాదాయ శాఖ మంత్రి ఉన్నారో, లేరో అర్థం కావటం లేదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం అలసత్వం వీడకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునిస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి:రాజమహేంద్రవరంలో సుబ్రహ్మణ్యేశ్వరుడి విగ్రహం ధ్వంసం