Agriculture Department: తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలతో పంటల సాగు నిదానంగా సాగుతోంది. ప్రస్తుత వానాకాలం సీజన్‌లో బుధవారం నాటికి 80.57 లక్షల ఎకరాల సాధారణ విస్తీర్ణానికి గాను 71.78 లక్షల ఎకరాల్లోనే పంటలు సాగైనట్లు వ్యవసాయశాఖ రాష్ట్ర ప్రభుత్వానికిచ్చిన నివేదికలో తెలిపింది. గతేడాది ఈ సమయానికి ఏకంగా 90 లక్షల ఎకరాలకు పైగా సాగవడం గమనార్హం. ఈ సీజన్‌లో ఏ ఒక్క పంట కూడా సాధారణం కన్నా అదనంగా సాగు కాకపోవడం గమనార్హం. వరినాట్లు వేయడానికి ఇంకా సమయమున్నందున సాధారణ స్థాయికి పంటల సాగు విస్తీర్ణం చేరే అవకాశముందని వ్యవసాయశాఖ అంచనా.
71 లక్షల ఎకరాల్లో పంటల సాగు.. వ్యవసాయశాఖ తాజా నివేదిక - హైదరాబాద్ తాజా వార్తలు
Agriculture Department: తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలతో పంటల సాగు నిదానంగా సాగుతోంది. ప్రస్తుత వానాకాలం సీజన్‌లో బుధవారం నాటికి 80.57 లక్షల ఎకరాల సాధారణ విస్తీర్ణానికి గాను.. 71.78 లక్షల ఎకరాల్లోనే పంటలు సాగైనట్లు వ్యవసాయశాఖ పేర్కొంది.
పంటల సాగు