ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TELANGANA: పాసు పుస్తకం జారీకి రూ.5 లక్షలు డిమాండ్‌.. ఏసీబీ వలలో తహసీల్దారు - కాటారం ఎమ్మార్వో వార్తలు

రెవెన్యూ శాఖలో అవినీతిని అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. కొందరు అధికారులు మాత్రం తమ చేతివాటం ప్రదర్శిస్తూనే ఉన్నారు. తాజాగా జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని కాటారం తహసీల్దార్‌ పెద్ద మొత్తంలో లంచం తీసుకుంటూ అవినీతి నిరోధకశాఖ అధికారులకు చిక్కారు.

acb rides in kataram mro office jayashankar bhupalapally district
అనిశా వలలో తెలంగాణలోని తహసీల్దారు

By

Published : Jul 23, 2021, 8:07 AM IST

అనిశా వలలో తెలంగాణలోని తహసీల్దారు

తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం తహసీల్దార్ సునీత ఏసీబీ వలకు చిక్కారు. హరికృష్ణ అనే ఓ రైతు వద్ద నుంచి రూ.2 లక్షలు లంచం తీసుకుంటుండగా అధికారులు ఆమెను రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నారు.

కాటారం మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన వికలాంగుడు ఐత హరికృష్ణ అనే రైతు కొత్తపల్లి శివారులోని సర్వే నెంబరు 3లో గల 4.25 గుంటల తన భూమిని ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని దరఖాస్తు చేసుకున్నాడు. రోజులు గడిచినా ఆన్‌లైన్‌లో నమోదు చేయకపోవడంతో తహసీల్దార్‌ సునీతను ఆశ్రయించాడు. రూ.5 లక్షలు లంచం ఇస్తేనే భూమిని ఆన్‌లైన్‌లో నమోదు చేస్తానని చెప్పడంతో హరికృష్ణ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.

తహసీల్దార్‌తో కుదుర్చుకున్న ముందస్తు ఒప్పందం మేరకు తొలి విడతగా రూ.50 వేలు ఇచ్చాడు. రెండో విడతలో మరో రూ.2 లక్షలు లంచం ఇస్తుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు సునీతను రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

కొత్తపల్లి శివారులోని సర్వే నెంబర్​ 3లో నాకు 4.25 గుంటల భూమి ఉంది. ఈ భూమికి కొత్త పాసు పుస్తకాల కోసం అడిగితే సంతకం పెట్టేందుకు ఎమ్మార్వో రూ.5 లక్షలు అడిగారు. రూ.3 లక్షలకు ఒప్పందం కుదిరింది. మొదటి విడతలో రూ.50 వేలు ఇచ్చాం. తర్వాత నాకు డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీ అధికారులను ఆశ్రయించాను. ఈరోజు రూ.2 లక్షలు ఇస్తుండగా అధికారులు రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నారు.-హరికృష్ణ, బాధిత రైతు

ఇదీ చూడండి:

"మాకు జ్ఞానోదయమైంది.. ఎస్సెల్పీని ఉపసంహరించుకుంటాం"

ABOUT THE AUTHOR

...view details