ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

దారుషిఫాలో చోరీ.. ఆస్ట్రేలియాలో లభ్యం - అమరావతి వార్తలు

ఎప్పుడో పద్దెనిమిదేళ్ల క్రితం చోరీకి గురైంది. ఇప్పుడు ఆస్ట్రేలియాలో దొరికింది. ప్రతి యేటా మొహర్రం రోజున ఊరేగింపులో ముస్లింలు ప్రదర్శించే ఆలం పతకం దోపిడీకి గురై.. 18 ఏళ్లు కనుమరుగైంది. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత అదే పండుగ సందర్భంగా దాని జాడ దొరికింది.

దారుషిఫాలో చోరీ.. ఆస్ట్రేలియాలో లభ్యం
దారుషిఫాలో చోరీ.. ఆస్ట్రేలియాలో లభ్యం

By

Published : Aug 15, 2021, 10:42 PM IST

హైదరాబాద్‌లో పద్దెనిమిదేళ్ల క్రితం దొంగలు ఎత్తుకెళ్లిన ఆలం (మొహర్రం ఊరేగింపులోని పీర్ల పతకం) త్వరలో ఇక్కడికి రానుంది. ఈ ఆలం తమకు లభించిందని కొద్దిరోజుల క్రితం ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రకటించింది. భారత్‌లోని సంప్రదాయాలు, విశ్వాసాలను గౌరవించి ఆలంను అప్పగిస్తున్నామంటూ కేంద్ర ప్రభుత్వానికి తెలిపింది. దిల్లీలోని ఆస్ట్రేలియా హై కమిషనర్‌ ఆలంను అప్పగించేందుకు తగిన సందర్భాన్ని పరిశీలిస్తున్నారని దక్కన్‌ హెరిటేజ్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ, తెలంగాణ వక్ఫ్‌బోర్డ్‌ డిప్యూటీ సీఈవో డాక్టర్‌ షఫిఉల్లా శుక్రవారం తెలిపారు.

తల్లి సంస్మరణార్థం..

పంచలోహాలు, బంగారుపూతతో తయారు చేసిన ఈ ఆలంను చివరి నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ తన తల్లి అమ్‌తుల్‌ జెహ్రాబేగం సంస్మరణార్థం ఏటా మొహర్రం నిర్వహిస్తున్న షియా మతస్థులకు 1956లో బహూకరించారు. దీనికి అలంకరణగా అప్పట్లోనే రూ.లక్షల విలువైన వజ్రాల హారాన్ని కూడా ఇచ్చారు. అప్పటి నుంచి ఏటా మొహర్రం ఊరేగింపులో ఆలంను ప్రదర్శించిన అనంతరం దారుషిఫాలోని ఆజా ఖానా జెహ్రాలో భద్రపరిచేవారు. 2003 ఏప్రిల్‌ 11న ఆలంను గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించుకుని వెళ్లారు. నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటినుంచి దర్యాప్తు కొనసాగుతోంది. అయితే హైదరాబాద్‌లో చోరీకి గురైన ఆలం ఆస్ట్రేలియాకు ఎలా వెళ్లిందన్న అంశంపై ఇప్పటికీ స్పష్టత లేదు.

ఇదీ చదవండి:

Arrest: రమ్య హత్య కేసులో నిందితుడు అరెస్ట్: డీజీపీ గౌతమ్ సవాంగ్

ABOUT THE AUTHOR

...view details