selfie suicide video: సెల్ఫీ వీడియో తీసుకుంటూ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తెలంగాణలోని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం షంషీర్ నగర్లో జరిగింది. యువతి ఆత్మహత్యకు పాల్పడటం.. చుట్టు పక్కల గ్రామాల్లో కలకలం సృష్టించింది. సెల్ఫీ తీసుకుంటూ యువతి చెప్పిన మాటలు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తాయి.
బెల్లంపల్లి పట్టణం షంషీర్ నగర్‌కు చెందిన తేజశ్రీ, నెన్నెల మండలం లంబడితాండ గ్రామానికి చెందిన ధరావత్ రాజ్ కుమార్ గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అతడు పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో యువతి గత కొన్ని నెలలుగా హాస్టల్లో ఉంటుంది. ఇంట్లో వాళ్ల మాటను పట్టించుకోకుండా ప్రేమికుడి మాటలు నమ్మింది. చివరికి అతడు ఆ యువతిపై నిందలు మోపి పెళ్లికి నిరాకరించడంతో ఏమి చేయాలో తెలియక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె ఈ మొత్తం విషయాన్ని సెల్ఫోన్లో సెల్ఫీ వీడియో తీసింది.