ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

HONEY TRAP: వలపు వల... మత్తు మాటలకు లొంగి..రూ.కోటి పోగొట్టుకుని

ఆన్​లైన్​లో పరిచయమైంది. అందమైన మాటలతో ముగ్గులోకి దింపింది. ప్రేమతో కవ్వించింది. వలపుతో కట్టిపడేసింది. ఆపదంటూ కన్నీరు కార్చింది. ఆదుకోమంటూ వేడుకుంది. ప్రేమకు.. పైసలకు సంబంధం లేదని నమ్మించింది. ఫస్ట్.. వెయ్యి రూపాయలతో ప్రారంభించింది.. కోటి రూపాయలు కాజేసింది! కోటి కొల్లగొట్టిన తర్వాత కానీ అర్థం కాలేదు మన సుబ్బారెడ్డికి మోసపోయానని!? క్రైం కథను తలపించే హనీ ట్రాప్​ ఏంటి? అసలేలా జరిగిందో తెలుసుకోండి...

HONEY TRAP
HONEY TRAP

By

Published : Oct 6, 2021, 11:05 PM IST

Updated : Oct 7, 2021, 3:35 PM IST

ఓ బావ... ఓ మరదలు.. ఓ ప్రియుడు.. మధ్యలో సుబ్బారెడ్డి! బావేంటి? మరదలేంటి? ప్రియుడేంటి? ఈ సుబ్బారెడ్డి ఎవరసలు అనుకుంటున్నారా? వెయ్యి కాదు.. లక్ష కాదు.. ఏకంగా కోటి రూపాయలు కాజేసిన కథండీ ఇది! హనీ ట్రాప్​లో పక్కాగా స్కెచ్ వేసి నిలువునా ముంచేసిన క్రైం స్టోరీ ఇది!

ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు జిల్లాకు చెందిన సుబ్బారెడ్డి ఓ రోజు ఓ మెస్సేజ్ వచ్చింది. ఎవరో.. ఎప్పటినుంచో తెలిసిన వ్యక్తి నుంచి వచ్చినట్టే ఉంది. కానీ.. తెలియదు! ఆ మెస్సేజే అతని జీవితాన్ని తలకిందులు చేస్తుందని అప్పుడు గ్రహించలేదు సుబ్బారెడ్డి. ఆ మెస్సేజే పోలీస్ట్​స్టేషన్ మెట్లెక్కిస్తుందని అప్పుడు అనిపించలేదు సుబ్బారెడ్డికి!

ఆన్​లైన్​లో ఆ పరిచయం రోజురోజుకూ పెరిగింది. ఏమండి దగ్గర నుంచి ఏం సంగతి వరకూ వచ్చింది. అదికాస్తా అంతకుమించి చేరింది. ఇదంతా ఓ ట్రాప్​ అని గ్రహించలేని సుబ్బారెడ్డి.. ఆ మెస్సేజ్​లకు మేఘాల్లో తేలిపోయాడు. పగలే కలలు కంటూ స్వర్గంలా ఫీలయ్యాడు. జీవితం ఈ క్షణం ఇలా ఆగిపోతే బాగుండని వేడుకున్నాడు. ప్రతిరోజూ ఆ మెస్సేజ్​ల కోసం.. ఆమె ఫోన్ కోసం పరితపించాడు.

అనుకోని కష్టం వచ్చింది. కానీ.. మిమ్మల్సి అడగకూడదు కదా? అంటూ స్టార్ట్ చేసింది. ఆ మాత్రం సాయం చేయలేనా.. అని అతడి నోటితోనే అనిపించింది. ఓ వెయ్యి రూపాయలు కావాలంటూ ప్రారంభించింది. బ్యూటీ పార్లర్ వ్యాపారానికి సాయం చేయాలని.. తర్వాత డబ్బులన్నీ రిటర్న్ ఇచ్చేస్తానని నమ్మించింది. పరిచయానికి పైసలకు సంబంధం లేదని.. తప్పకుండా మళ్లీ మనీ రిటర్న్ తీసుకోవాలని రూల్ కూడా పెట్టేసింది!

ఆమె మాటల్లో మునిగిపోయిన సుబ్బారెడ్డి అడిగినప్పుడల్లా డబ్బులు ఇచ్చేశాడు. మళ్లీ ఇస్తుందా? లేదా అనేది ఆలోచించకుండా ఆ మాటలకు పడిపోయాడు! అలా.. వెయ్యి రూపాయలతో ప్రారంభమైనది.. కోటి రూపాయలకు చేరింది. ఆ తర్వాత ఆమె ప్రవర్తనలో మార్పు వచ్చింది. డబ్బులు అడిగితే రివర్స్ అవడం ప్రారంభించింది. ఏం చేయాలో తెలియని సుబ్బారెడ్డి పోలీసులను ఆశ్రయించాడు.

హైదరాబాద్​లోని అంబర్​పేట పోలీసులు రంగంలోకి దిగారు. అసలేం జరిగిందో కనుక్కునే పనిలో పడ్డారు. ఆసక్తి కలిగించే ఎన్నో విషయాలు బయటికొచ్చాయి. అర్చన.. తన బావ, ప్రియుడితో కలిసి ఈ గేమ్ ఆడిందని తెలిసింది. సుబ్బారెడ్డి.. అర్చన బావకు ముందే తెలుసు. ముగ్గురూ కలిసి పక్కా స్కెచ్​తోనే సుబ్బారెడ్డికి గాలం వేశారు. పోలీసులు అర్చనతోపాటు ఆమె బావను, ప్రియుడిని అరెస్ట్ చేశారు. రిమాండ్​కు తరలించారు.

హనీట్రాప్​.. ఈ మధ్య కాలంలో పెరిగిపోయింది. పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నా.. మోసపోయేవాళ్ల సంఖ్య పెరుగుతూనే ఉంది. అర్చన కథతోనైనా మరో సుబ్బారెడ్డి బలికాకూడదని ఉండాలని ఆశిద్దాం.

ఇదీ చదవండి:TDP: దగ్ధమైన బోటులో మత్తు పదార్థాలున్నాయి: వర్ల రామయ్య

Last Updated : Oct 7, 2021, 3:35 PM IST

ABOUT THE AUTHOR

...view details