ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Woman died at Pargi : ఆమె మృతికి అతడిచ్చిన ఇంజెక్షనే కారణం...మాకు న్యాయం కావాలి.. - తెలంగాణ వార్తలు

woman died at Pargi : అనారోగ్యంతో బాధపడుతున్న ఓ మహిళ.. ఆర్​ఎంపీ వద్ద చికిత్స తీసుకుంది. ఆ వైద్యుడు ఇంజెక్షన్ ఇచ్చిన కాసేపటికే అస్వస్థతతో మృతి చెందిందని ఆమె కుటుంబ సభ్యులు ఆర్​ఎంపీ ఇంటిని ముట్టడించారు. ఈ ఘటన తెలంగాణలోని వికారాబాద్ జిల్లా పరిగిలో చోటు చేసుకుంది.

Woman died at Pargi
మహిళకు ఆర్​ఎంపీ ఇంజెక్షన్.. వైద్యం వికటించి మృతి!

By

Published : Jan 23, 2022, 3:34 PM IST

woman died at Pargi : వైద్యం వికటించి మహిళ మృతి చెందిందటూ బాధితురాలి కుటుంబ సభ్యులు ఆర్​ఎంపీ ఇంటిని ముట్టడించారు. వైద్యుడి నిర్లక్ష్యం వల్లే మహిళ చనిపోయిందని ఆరోపిస్తున్నారు.

ఏం జరిగింది?

తెలంగాణలోని వికారాబాద్ జిల్లా పరిగిలో అనారోగ్యంతో బాధపడుతున్న ఓ మహిళ.. ఆర్​ఎంపీ వద్ద చికిత్స పొందింది. అనారోగ్యం కారణంగా ఆర్‌ఎంపీ క్లినిక్‌కు శనివారం రాత్రి వెళ్లిందని.. వైద్యుడు ఇంజెక్షన్ ఇచ్చి ఇంటికి పంపించాడని బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. ఇంటికి వచ్చిన కాసేపటి తర్వాత ఆమె అస్వస్థతతో చనిపోయిందని పేర్కొన్నారు. వైద్యుడి నిర్లక్ష్యం కారణంగానే మృతి చెందిందని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. అతడిపై చర్యలు తీసుకొని... తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details