ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

covid test: టెస్టు సమయంలో ముక్కులో విరిగిన స్క్వాబ్ - కరీంనగర్ జిల్లా

కొవిడ్​ పరీక్షల్లో భాగంగా ఓ సర్పంచ్​కు టెస్టు(covid test) చేస్తున్న క్రమంలో అతని ముక్కులో స్క్వాబ్ చిక్కుకుంది... తీసే ప్రయత్నం చేసినా ఫలించలేదు. ఆ స్క్వాబ్ ముక్కులోనే విరిగిపోయింది. దీంతో దానిని తీసేందుకు స్థానికంగా వైద్య సదుపాయం లేకపోవటంతో... కరీంనగర్ ప్రైవేట్ ఆస్పత్రిలో ఎండోస్కోపి ద్వారా దానిని బయటకు తీశారు. ఈ సంఘటన తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో జరిగింది.

covid test
టెస్టు సమయంలో ముక్కులో విరిగిన స్క్వాబ్

By

Published : Jun 11, 2021, 7:55 PM IST

టెస్టు సమయంలో ముక్కులో విరిగిన స్క్వాబ్

తెలంగాణలోని కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెంకట్రావుపల్లి సర్పంచ్ జవ్వాజి శేఖర్.. కరోనా పరీక్ష(covid test) చేయించుకునే సమయంలో ముక్కులో స్క్వాబ్ విరిగింది. దీంతో ఆందోళనకు గురైన ఆయన వైద్యం కోసం పరుగులు తీశాడు.

కరీంనగర్ ప్రైవేట్ ఆస్పత్రిలో ఎండోస్కోపి ద్వారా విరిగిన పుల్లను వెలికి తీశారు. ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఇదీ చూడండి:చీరకట్టులో సవారీలు.. రూ.లక్షల్లో ఆర్జన!

ABOUT THE AUTHOR

...view details