సన్నబడాలనే భర్త వేధింపులు తట్టుకోలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన మేడ్చల్ జిల్లా దుండిగల్ పరిధిలో జరిగింది. మల్లంపేటకు చెందిన కానిస్టేబుల్ శివ కుమార్ సనత్నగర్ పీఎస్లో పనిచేస్తున్నాడు. ఎనిమిదేళ్ల క్రితం శ్రీలత(28)తో వివాహం జరిగింది. పెళ్లైన రెండేళ్లకు అదనపు కట్నం తేవాలని ఆమెను వేధించాడు. శ్రీలత తల్లిదండ్రులు కొంత డబ్బును ఇచ్చారు. దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు పుట్టాక మళ్లీ వేధింపులకు గురిచేశాడు.
సన్నబడాలని వేధించటంతో వివాహిత ఆత్మహత్య..
సన్నగా ఉండాలనే భర్త కోరికకు ఓ వివాహిత బలై పోయింది. లావుగా ఉన్నావని.. సన్నబడాలని అతని వేధింపులు తట్టుకోలేక మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మేడ్చల్ జిల్లా దుండిగల్ పరిధిలో చోటు చేసుకుంది. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు అతనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
సన్నబడాలని వేధించటంతో ఓ వివాహిత ఆత్మహత్య..
లావయ్యావని.. తగ్గడానికి మరో రూ.5 లక్షలు తీసుకురావాలని శ్రీలతను వేధించడం ప్రారంభించాడు. మనస్తాపం చెందిన బాధితురాలు దుండిగల్ పరిధిలోని పోచంపల్లి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. భర్త వేధింపులు తట్టుకోలేకే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి:పురపోరు: కడపలో కాంగ్రెస్, వైకాపా నాయకుల మధ్య వాగ్వాదం