VDC insulted villager: అకారణంగా గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు జరిమానా విధించారని ఓ వ్యక్తి సూసైడ్ నోట్ రాసి అదృశ్యమయ్యాడు. తెలంగాణలోని నిర్మల్ జిల్లా నర్సాపూర్-జి మండలం టెంబుర్ని గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బూర నర్సయ్య ఇటీవల తన ఇంట్లో ఓ శుభకార్యం చేశాడు. ఫంక్షను కోసం అతని బంధువులు ఊళ్లోని బెల్టు షాపులో కాకుండా బయటనుంచి మద్యం తీసుకువచ్చారు. విషయం తెలుసుకున్న వీడీసీ సభ్యులు.. మద్యాన్ని ఊళ్లోని బెల్ట్‌షాపులో కాకుండా బెల్టు షాపులో కొనుగోలు చేసినందుకు రూ. 32 వేలు జరిమానా విధించారు.
దారుణం: బెల్ట్షాప్లో మద్యం కొనలేదని జరిమానా.. బాధితుడి కఠిన నిర్ణయం! - ఊళ్లో మద్యం కొనలేదని జరిమానా
VDC insulted villager: ఊళ్లోని బెల్టు షాపుల్లో మద్యం కొనుగోలు చేయలేదని జరిమానా విధించినందుకు మనస్తాపం చెందాడు ఓ వ్యక్తి. దీంతో సూసైడ్ నోటు రాసి అదృశ్యమయ్యాడు. స్థానికంగా ఉన్న నది వంతెన వద్ద బైక్, సూసైడ్ నోటు లభించడంతో కుటుంబసభ్యులు ఆందోళనలో ఉన్నారు. సదరు వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్న ఘటన తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో చోటుచేసుకుంది.
ఈ ఘటనతో మనస్తాపం చెందిన నర్సయ్య.. ఆదివారం సూసైడ్ నోట్ రాసి.. సోన్ మండల కేంద్రంలోని గోదావరి బ్రిడ్జిపై ద్విచక్రవాహనం ఉంచి అదృశ్యమయ్యాడు. అవమానం భరించలేకనే చనిపోవాలని నిర్ణయించుకున్నట్లు.. పలువురి పేర్లు పేర్కొంటూ తన చావుకు కారణం వాళ్లేనని.. లేఖలో రాశారు. నర్సయ్య కనిపించకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబీకులు.. అంతటా గాలించారు. ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీడీసీ సభ్యులు చేసిన అవమానం వల్లే నర్సయ్య కనిపించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నర్సయ్య కోసం గాలిస్తుండగా.. గోదావరి బ్రిడ్జి వద్ద సూసైడ్ నోట్, బైక్ లభ్యమైంది. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. అదృశ్యం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి: