తెలంగాణలోని కాళేశ్వరం జలాల్లో చేపల వేటకు వెళ్లిన ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. మల్లన్నసాగర్ నుంచి నిజాంసాగర్‌కు కాళేశ్వరం జలాలు విడుదల చేశారు. మెదక్ జిల్లా తూప్రాన్ ఆబోతుపల్లి చెక్‌డ్యామ్ వద్ద రావల్లికి చెందిన ముగ్గురు చేపల వేటకు వెళ్లారు.
తెలంగాణ: చేపల వేటకు వెళ్లి వ్యక్తి గల్లంతు - నీటిలో గల్లంతైన వ్యక్తి
చేపల వేటకు వెళ్లిన ఓ వ్యక్తి కాళేశ్వరం జలాల్లో గల్లంతైన ఘటన తెలంగాణలోని మెదక్ జిల్లా తూప్రాన్ ఆబోతుపల్లి చెక్‌డ్యామ్ వద్ద జరిగింది. అతని ఆచూకీ ఇంకా తెలియరాలేదు.
చేపల వేటకు వెళ్లి వ్యక్తి గల్లంతు
చేపలు పట్టే సమయంలో ప్రమాదవశాత్తు కిష్టయ్య అనే వ్యక్తి నీళ్లలో పడిపోయాడు. ప్రవాహంలో కొట్టుకుపోతున్న కిష్టయ్యను తాడుతో కాపాడేందుకు స్థానికులు ప్రయత్నించారు. ఒడ్డుకు చేరువగా వచ్చిన కిష్టయ్య ఉన్నట్టుండి నీటిలో మునిగి గల్లంతయ్యాడు.