ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

భార్యను నీళ్ల బకెట్లో ముంచి చంపాడు.. తాను రైలు కింద తలపెట్టాడు..!!

husband killed wife: వాళ్లిద్దరూ ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. కొద్ది రోజులపాటు కాపురం సజావుగా సాగింది. ఇంతలో ఏమైందో కానీ ఆ జంట మధ్య అనుమానం రాజుకుంది. అనుమానం పెనుభూతంగా మారి కట్టుకున్న భార్యనే కడతేర్చాడు. ఆమెను చంపేశాక పోలీసులకు ఎలాగూ దొరుకుతాను.. శిక్ష తప్పదని భావించాడో ఏమో.. తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తెలంగాణలోని హైదరాబాద్​లో చోటుచేసుకుంది.

మహానంద బిశ్వాస్‌, పంపా సర్కార్‌
మహానంద బిశ్వాస్‌, పంపా సర్కార్‌

By

Published : Jun 29, 2022, 5:00 PM IST

husband killed wife: ఆ జంట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొద్ది రోజులపాటు కాపురం సజావుగానే సాగింది. ఇంతలో ఆ దంపతుల మధ్య అనుమానం రాజుకుంది. అది పెనుభూతమై ఇద్దరి ప్రాణాలనూ బలిగొంది. భార్యను నీళ్ల బకెట్‌లో ముంచి చంపేశాడు. తానూ రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈఘటన తెలంగాణలోని హైదరాబాద్​లో జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలను పంజాగుట్ట డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ నర్సింహరాజు వెల్లడించారు. అస్సాంకు చెందిన మహానంద బిశ్వాస్‌(24), పంపా సర్కార్‌(22) ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఏడాదిన్నర కిందట పెళ్లి చేసుకున్నారు. జీవనోపాధి నిమిత్తం కొన్నాళ్ల క్రితం నగరానికి వచ్చారు.

తొలుత ఆదిభట్లలోని ఓ సంస్థలో సెక్యూరిటీ గార్డులుగా పనిచేశారు. తర్వాత పంజాగుట్ట సమీపంలోని ప్రేమ్‌నగర్‌లో అద్దె ఇంట్లో నివాసముంటూ.. బంజారాహిల్స్‌లోని ఓ ప్రముఖ మాల్‌లో కాపలాదారులుగా చేరారు. కొన్ని రోజులకే భార్య ప్రవర్తనపై మహానంద బిశ్వాస్‌ అనుమానం పెంచుకున్నాడు. ఈ అంశంపై ఇద్దరూ తరచూ ఘర్షణ పడేవారు. సోమవారం మధ్యాహ్నం భార్య పంపా సర్కార్‌తో గొడవపడిన బిశ్వాస్‌ నిండుగా నీరున్న బకెట్‌లో ఆమె తల ముంచి హతమార్చాడు.

గదికి తాళం వేసి లక్డీకాపుల్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలోని వంతెన వద్ద రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అతడి వద్ద లభించిన పాకెట్‌ డైరీలో అస్సామీ భాషలో తన భార్యను చంపి, ఆత్మహత్యకు పాల్పడుతున్నానని రాసి ఉండటాన్ని రైల్వే పోలీసులు గుర్తించారు. ఇంటి చిరునామా సైతం ఉండటంతో పంజాగుట్ట పోలీసులకు సమాచారం అందించారు. మంగళవారం పంజాగుట్ట పోలీసులు వారి ఇంటి వద్దకు చేరుకొని తాళం పగులగొట్టి చూడగా.. పంపా సర్కార్‌ బకెట్‌లో మృతి చెంది ఉండటాన్ని గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details