ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రైతుల పేరుతో... సీడ్ యాక్సెస్ రహదారిపై వెలసిన బోర్డు

అమరావతిలో రాజధాని హైవే రైతుల పేరిట సీడ్ యాక్సెస్ రోడ్డు పై ఒక బోర్డు ఏర్పాటయింది. "జై జవాన్ జై కిసాన్" అనే నినాదంతో నేషనల్ హైవే బాధిత రైతుల పేరుతో ఈ బోర్డును ఏర్పాటు చేశారు.

Seed Access Road
రైతుల పేరిట సీడ్ యాక్సెస్ రహదారిపై వెలసిన బోర్డు

By

Published : Jan 28, 2021, 1:53 PM IST

అమరావతిలో నిర్మించిన సీడ్ యాక్సెస్ రహదారి పరిహారం చెల్లింపులో అన్యాయం జరిగిందంటూ బాధిత రైతుల పేరిట ఒక బోర్డు వెలిసింది. జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో నేషనల్ హైవే మీద ఈ బోర్డును ఏర్పాటు చేశారు. 2013లో రైతులను సంప్రదించకుండా అవార్డు ఇచ్చారని.. వెంటనే దానిని రద్దు చేయాలని ఆ బోర్డులో పేర్కొన్నారు. 2017లో సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మించి తమకు న్యాయం చేస్తామని నమ్మించి అన్యాయం చేశారని ఆరోపించారు. ఇలా మెుత్తం ఏడు అంశాలతో కూడిన డిమాండ్లను అందులో ఉంచారు.

ఏడేళ్ల నుంచి ప్రభుత్వం న్యాయం చేయలేదని అందుకే న్యాయదేవతను ఆశ్రయించినట్లు రైతులు ఆ బోర్డు ద్వారా విన్నవించారు. కోట్లు విలువ చేసే భూమికి లక్షలు చెల్లించి లాక్కుంటే.. అది రైతు జీవించే హక్కును కాలరాయడమే అని పేర్కొన్నారు. భూమి ఇచ్చిన రైతుకు అన్యాయం ఎలా చేస్తారని అందులో ప్రశ్నించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి పెద్ద మనసుతో న్యాయం చేయాలని.. బోర్డు ద్వారా రైతులు ప్రభుత్వానికి నివేదించారు.

ABOUT THE AUTHOR

...view details