- చోరీలకు పాల్పడుతున్న బంగ్లాదేశీయులు అరెస్ట్, ఎక్కడంటే
బంగ్లాదేశ్‌లో ట్రక్కు డ్రైవర్లు, టీ దుకాణదారులుగా జీవిస్తూ భారత్‌లో చోరీలకు పాల్పడుతున్న ఏడుగురు ముఠా సభ్యులను గన్నవరం పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. విలేకరుల సమావేశంలో ఎస్పీ జాషువా నిందితుల వివరాలను వెల్లడించారు.
- తగ్గేదే లా, అంటోన్నతాడికొండ వైకాపాలోని ఆధిపత్యపోరు
గుంటూరు జిల్లా తాడికొండ వైకాపాలో ఆధిపత్యపోరు మరింత ముదురుతోంది. నియోజకవర్గ వైకాపా అదనపు ఇంఛార్జ్‌గా డొక్కా మాణిక్యవరప్రసాద్ నియామకాన్ని నిరసిస్తూ తాడికొండలో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మద్దతుదారులు ర్యాలీకి సిద్ధమయ్యారు. తాడికొండ కూడలిలో ర్యాలీ ప్రారంభించే సమయంలో డొక్కా వర్గం అక్కడికి చేరుకుని డొక్కాకు అనుకూలంగా నినాదాలు చేసింది.
- ట్రాఫిక్ సీఐని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
విశాఖ జిల్లా పాత గాజువాక కూడలిలో రోడ్డు ప్రమాదం జరిగింది. విధినిర్వహణలో ఉన్న ట్రాఫిక్ సీఐ సత్యనారాయణ రెడ్డిని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సీఐకి స్వల్ప గాయాలయ్యాయి. తోటి సిబ్బంది వెంటనే అతనిని ఆస్పత్రికి తరలించారు.
- కుప్పంను ఆక్రమించుకోవాలనుకోవడం పెద్దిరెడ్డికి పగటికలే
కుప్పంను ఆక్రమించుకోవాలనుకోవడం మంత్రి పెద్దిరెడ్డికి పగటికలే అవుతుందని తెదేపా నేత వర్ల రామయ్య అన్నారు. ఎంత అణగదొక్కితే రెట్టింపు వేగంతో ప్రజలు తిప్పికొడతారని హెచ్చరించారు.
- భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ యుయు లలిత్ ప్రమాణం
భారత 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ యు.యు. లలిత్ ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ లలిత్‌తో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సీజేఐగా ప్రమాణం చేయించారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సహా పలువురు కేంద్రమంత్రులు, న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు.
- దుమ్మురేపిన వందే భారత్, ట్రయల్ రన్‌లో గంటకు 180 కిమీ వేగం