ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

AP TOP NEWS ఏపీ ప్రధాన వార్తలు 9 PM - Telugu latest news

.

AP TOP NEWS
ఏపీ ప్రధాన వార్తలు

By

Published : Oct 18, 2022, 8:59 PM IST

  • అమరావతే ఆంధ్రప్రదేశ్​కు ఏకైక రాజధాని.. రైతులతో రాహుల్​
    AMARAVATI FARMERS MEET RAHUL GANDHI : కర్నూలు జిల్లాలో ప్రవేశించిన భారత్​ జోడో యాత్రలో రాహుల్ గాంధీని అమరావతి రైతులు కలిశారు. అమరావతినే రాజధానిగా ఉండాలని రాహుల్​ను కోరారు. అమరావతే ఆంధ్రప్రదేశ్​కు ఏకైక రాజధానిగా ఉంటుందని రాహుల్ గాంధీ చెప్పినట్లు అమరావతి రైతులు తెలిపారు. తమ పాదయాత్రకు సంఘీభావం తెలిపారని.. న్యాయ సహాయం చేస్తామని చెప్పారని.. వీలైతే పాదయాత్రలో పాల్గొంటానని రాహుల్​ చెప్పినట్లు రైతులు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాటం: చంద్రబాబు, పవన్​కల్యాణ్​
    CBN COMMENTS ON LATEST POLITICS : విశాఖలో పవన్‌పై రాష్ట్ర ప్రభుత్వం చేసిన విధానం సరికాదని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలు ఖండిస్తున్నామన్నారు. విజయవాడలో పవన్​ను​ కలిసి సంఘీభావం తెలిపారు. అనంతరం చంద్రబాబు, పవన్​లు ఇద్దరూ కలిసి మీడియాతో మాట్లాడారు. విశాఖలో తలపెట్టిన కార్యక్రమం కోసమే అక్కడకు వెళ్లారని.. ఒకేసారి రెండు పార్టీల కార్యక్రమం జరిగితే పోలీసులు తగిన ఏర్పాట్లు చేస్తారన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • పవన్​ చెప్పు చూపిస్తే.. వైకాపాలో చిన్నపిల్లాడు కూడా భయపడడు: మంత్రులు
    MINISTERS FIRES ON PAWAN : జనసేన అధినేత చెప్పు చూపించటంపై వైకాపా మంత్రులు తీవ్రంగా మండిపడ్డారు. చెప్పు చూపిస్తే వైకాపాలో ఉండే చిన్నపిల్లోడు కూడా భయపడడని అన్నారు. పవన్​ ఒక్క చెప్పు చూపిస్తే.. వైకాపా కార్యకర్తలు వందల చెప్పులు చూపించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు.
    పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • వివేకై హత్య కేసులో సునీతారెడ్డి చెప్పినవన్నీ నిజాలే: సీబీఐ
    YS VIVEKA MURDER CASE : మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలన్న పిటిషన్‌పై సుప్రీంకోర్టులో సీబీఐ కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేసింది. వైఎస్‌ వివేకా కుమార్తె సునీతారెడ్డి పిటిషన్‌ రేపు విచారణకు రానున్న దృష్ట్యా.. సీబీఐ కౌంటర్‌ దాఖలు చేసింది. ఈ కేసుకు సంబంధించి పిటిషన్‌లో సునీతారెడ్డి చెప్పినవన్నీ నిజాలేనని సీబీఐ పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • బైక్​ స్పీడో మీటర్​లో పాము.. పొలంలో కొండచిలువ
    మధ్యప్రదేశ్​లో వేర్వేరు ఘటనల్లో రెండు పాములు కలకలం సృష్టించాయి. నర్​సింగ్​పుర్​ జిల్లాలో ఓ వ్యక్తి బైక్​ స్పీడో మీటర్​లో​ పాము ఇరుక్కుపోయింది. బర్​హతా ప్రాంతంలోని నజీర్​ ఖాన్​ అనే వ్యక్తి రోజులాగే తన బైక్​ని స్టార్ట్​ చేయడానికి ప్రయత్నించగా పాము బుసలు కొట్టిన శబ్ధం వినిపించింది. బైక్​ని పూర్తిగా గమనించిన యువకుడు​ స్పీడోమీటర్​లో ఉన్న పామును గుర్తించాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • అత్తింటిపై పెట్రోల్ పోసి నిప్పు.. భార్యాపిల్లలు, అత్తామామలు సజీవ దహనం
    పంజాబ్​ జలంధర్​లో దారుణం జరిగింది. అత్తింటిపై పెట్రోల్​ పోసి నిప్పంటించాడు ఓ వ్యక్తి. ఈ ఘటనలో భార్యాపిల్లలు, అత్తామామలు సజీవ దహనమయ్యారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • నైజీరియాలో వర్షాల బీభత్సం.. వరదల ధాటికి 600 మంది బలి
    Nigeria Floods : నైజీరియాను వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. భీకర వరదల కారణంగా నైజీరియాలో 600 మందికి పైగా ప్రజలు మరణించారని అధికారులు తెలిపారు. మరో 13లక్షల మంది నిరాశ్రయులుగా మారారని పేర్కొన్నారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • నో కాస్ట్ ఈఎంఐతో వస్తువులు కొంటున్నారా? ఇవి తెలుసుకోండి!
    పండగల వేళ ఎన్నో రాయితీలు.. చేతిలో డబ్బు లేకున్నా కోరుకున్న ఉత్పత్తులను ఇంటికి తీసుకొచ్చేందుకు వీలుగా రుణ సదుపాయాలు.. ప్రధానంగా సున్నా వడ్డీతో వాయిదాల (జీరో కాస్ట్‌ ఈఎంఐ) సౌలభ్యం ఎంతోమందిని ఆకర్షిస్తుంటుంది. దీన్ని ఉపయోగించుకునే ముందు పరిశీలించాల్సిన కొన్ని ముఖ్యాంశాలు ఏమిటో చూద్దాం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • టీమ్‌ఇండియాకు అలాంటోడు అవసరం: సచిన్‌
    టీ20లో ప్రపంచకప్​లో టీమ్‌ఇండియా అనుసరించాల్సిన వ్యూహాలపై దిగ్గజ క్రికెటర్​ సచిన్‌ తెందుల్కర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమ్‌ఇండియా తుది జట్టులో ఒక లెఫ్ట్‌ హ్యాండర్‌ బ్యాటర్‌ ఉండాల్సిన అవసరం ఉందని తెలిపాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'గీతా ఆర్ట్స్‌'లో 'గీత' ఎవరో తెలుసా? సీక్రెట్​ చెప్పేసిన అల్లు అరవింద్‌
    టాలీవుడ్​లో ఎన్నో సూపర్ హిట్​ చిత్రాలను నిర్మించిన నిర్మాణ సంస్థలలో గీతాఆర్ట్స్ ఒకటి. అయితే తమ నిర్మాణ సంస్థకు గీత అనే పేరు పెట్టడానికి గల కారణాన్ని తెలిపారు. ఏంటంటే? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details