- కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం..
మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ తర్వాత తొలిసారిగా జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర లభించింది. ఈ ఏడాది వ్యవసాయ సీజన్‌ను ముందుగానే ప్రారంభించాలని కేబినెట్లో నిర్ణయం తీసుకున్నామని మంత్రులు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రాష్ట్రంలో వ్యవస్థల పతనం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది: చంద్రబాబు
రాష్ట్రంలో వ్యవస్థల పతనం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ముఖ్యమంత్రి కాన్వాయ్‌కు కార్లు పెట్టిన వారికి బిల్లులు చెల్లించకపోవడం రాష్ట్ర దుస్థితికి నిదర్శనమన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పెళ్లిపీటలపై వధువు మృతికేసులో ఊహించని ట్విస్ట్..
విశాఖ మధురవాడలో పెళ్లిపీటలపై కుప్పకూలి వధువు చనిపోయిన ఘటన కీలక మలుపు తిరిగింది. తొలుత సాధారణ మరణంగానే భావించినా.. ఆ తర్వాత అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నివేదిక వచ్చాక పూర్తి వివరాలు తెలియనున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- వివేకా కేసులో దర్యాప్తు ఎప్పటికి పూర్తి చేస్తారు: సీబీఐని ప్రశ్నించిన హైకోర్టు
మాజీ మంత్రి వివేకానంద హత్య కేసు నిందితులు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, గజ్జల ఉమాశంకర్‌రెడ్డి, సునీల్‌యాదవ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. వివేకా కేసులో పోలీసులు ఇప్పటికే చార్జిషీట్ దాఖలు చేశారని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆ యువతి సమాధానంతో ప్రధాని మోదీ భావోద్వేగం
ప్రభుత్వ పథకాలు వంద శాతం ప్రజలకు చేరటం వల్ల వివక్ష, బుజ్జగింపు రాజకీయాలకు తెరపడిందన్నారు ప్రధాని మోదీ. గుజరాత్లో నిర్వహించిన ఉత్కర్ష్ సమారోహ్ కార్యక్రమానికి వర్చువల్‌గా హాజరయ్యారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఉగ్రవాదుల కిరాతకం.. కశ్మీరీ పండిట్ దారుణ హత్య
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోమారు రెచ్చిపోయారు. కశ్మీరీ పండిట్ అయిన ప్రభుత్వ ఉద్యోగిని దారుణంగా కాల్చి చంపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- శ్రీలంక ప్రధానిగా విక్రమసింఘె- ఆ పార్టీ నుంచి గెలిచిన ఒకేఒక్కడు!
శ్రీలంకలో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి తెరదించుతూ కొత్త ప్రధానిని నియమించే దిశగా చర్యలు తీసుకున్నారు ఆ దేశ అధ్యక్షుడు గోటబయా రాజపక్స. మాజీ ప్రధాని మహింద రాజపక్స స్థానంలో యూఎన్‌పీ పార్టీ అధ్యక్షుడు, మాజీ పీఎం రణిల్ విక్రమసింఘెకు బాధ్యతలు అప్పగించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- దడ పుట్టిస్తున్న ధరలు.. 8ఏళ్ల గరిష్ఠానికి ద్రవ్యోల్బణం!
దేశంలో ద్రవ్యోల్బణం భారీగా పెరిగింది. మార్చిలో 6.95 శాతం ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం.. ఏప్రిల్‌లో 7.79 శాతానికి పెరిగింది. ఇది ఎనిమిదేళ్ల గరిష్ఠ స్థాయి కావడం ఆందోళనకరం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 100 మీటర్ల హర్డిల్స్‌లో 'తెలుగమ్మాయి' జాతీయ రికార్డు
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జ్యోతి.. సైప్రస్ అంతర్జాతీయ మీట్‌లో స్వర్ణ పతకం సాధించింది. 100 మీ హర్డిల్స్‌ను 13.23 సెకన్లలో పూర్తిచేసి ప్రథమ స్థానంలో నిలిచింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'సర్కారు వారి పాట' సక్సెస్ సెలబ్రేషన్స్- '9 అవర్స్' వెబ్ సిరీస్ రిలీజ్
'సర్కారు వారి పాట' సినిమా సక్సెస్ సెలబ్రెేషన్స్ను నిర్వహించింది చిత్ర బృందం. అలాగే దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన వెబ్ సిరీస్ ‘9 అవర్స్’ స్ట్రీమింగ్‌పై అప్డేట్ వచ్చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.