ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @9PM

.

By

Published : Mar 2, 2022, 8:57 PM IST

ప్రధాన వార్తలు @9PM
TOP NEWS

  • ఏపీ రాజధాని అమరావతేనన్న కేంద్రం.. బడ్జెట్‌లో కేటాయింపులు
    రాష్ట్ర రాజధాని అమరావతి పేరుతో బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రొవిజన్‌ పెట్టింది. అమరావతినే రాజధానిగా పేర్కొంటూ.. ప్రాథమికంగా లక్ష రూపాయలు కేటాయించింది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం రాజధాని నిర్మాణానికి నిధులు ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • వ్యవసాయ రంగంలో ఏపీని ఉన్నత స్థాయిలో ఉంచడమే లక్ష్యం: సీఎం జగన్
    వ్యవసాయ రంగంలో భారతదేశంలోనే ఏపీని అత్యుత్తమ స్థాయిలో ఉంచాలనేదే ప్రభుత్వ లక్ష్యమని సీఎం జగన్‌ అన్నారు. అందుకోసం రైతులను అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. "స్టేట్‌ క్రెడిట్‌ సెమినార్‌ 2022–23"లో సీఎం పాల్గొన్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్టేట్‌ ఫోకస్‌ పేపర్‌ 2022-23 ను సీఎం విడుదల చేశారు. నాబార్డు ఛైర్మన్‌ గోవిందరాజులు సహా వివిధ బ్యాంకుల ఉన్నతాధికారులు, మంత్రులు సమీక్షలో పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • రాజకీయ నాయకులకు నైతిక విలువలుండాలి: ఉపరాష్ట్రపతి
    ఏలూరులోని సి.ఆర్‌.రెడ్డి కళాశాల వజ్రోత్సవాల్లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. ఆకలి, అవినీతి, లింగ వివక్ష లేనప్పుడే దేశం అభివృద్ధి చెందినట్లని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • రాష్ట్రంలో ఏ క్షణమైనా ఎన్నికలు రావచ్చు: అచ్చెన్నాయుడు
    రాష్ట్రంలో ఏ క్షణమైనా ఎన్నికలు రావొచ్చని.. ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కార్యకర్తలకు సూచించారు. రాష్ట్ర సర్కార్​ అవలంభిస్తున్న రైతు, ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • యూపీలో ఆరో విడత ఎన్నికలకు సర్వం సిద్ధం
    ఉత్తర్​ప్రదేశ్​లో 292 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు ముగిశాయి... యూపీ సమరం పూర్వాంచల్ వైపు మళ్లింది... భాజపా, ఎస్పీ పార్టీలు తమ మిత్రపక్షాలపై ఆశలు పెట్టుకుంటుండగా... 111 సీట్లకు నెలవైన పూర్వాంచల్​లో ఎవరు పట్టు సాధిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇందులో 57 స్థానాలకు గురువారం పోలింగ్ జరగనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • రష్యాను ఎదుర్కోవడానికి మేము సిద్ధం: బైడెన్
    రష్యాను ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ వెల్లడించారు. పుతిన్​.. పక్కా ప్రణాళికతోనే ఈ యుద్ధాన్ని ప్రారంభించారని అన్నారు. అమెరికా, దాని భాగస్వామ్య దేశాలు నాటోలోని ప్రతి అంగుళాన్ని కాపాడుకుంటాయని స్పష్టం చేశారు.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • వార్​ ఎఫెక్ట్​.. మార్కెట్లు ఢమాల్​.. సెన్సెక్స్​ 778 పాయింట్లు డౌన్​
    రష్యా- ఉక్రెయిన్​ యుద్ధం నేపథ్యంలో.. స్టాక్​ మార్కెట్లు బుధవారం భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ 778 , నిఫ్టీ 187 పాయింట్లు కోల్పోయాయి. చముర ధరల పెరుగుదల మార్కెట్ల పతనానికి కారణమైంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఐపీఎల్​లో 25% ప్రేక్షకులకు అనుమతి- మార్చి 8న ముంబయికి జట్లు
    ఐపీఎల్​ నిర్వహణపై బుధవారం మహారాష్ట్ర ప్రభుత్వంతో బీసీసీఐ చర్చించింది. మొదటి దశకు 25 శాతం ప్రేక్షకులను అనుమతిచ్చింది. మరోవైపు ఐపీఎల్ జట్లన్నీ మార్చ 8లోపు ముంబయి చేరుకుంటాయి. 14నుంచి సాధన ప్రారంభిస్తాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • అతిపెద్ద స్క్రీన్​పై 'ఆర్​ఆర్​ఆర్'.. వినూత్న​ ఐడియాతో 'రాధేశ్యామ్'​!
    'ఆర్​ఆర్​ఆర్'​ సినిమా ఓ అరుదైన ఘనత సాధించనుంది. యూకేలోని అతిపెద్ద స్క్రీన్​పై ప్రదర్శనకానున్న తొలి భారతీయ చిత్రంగా రికార్డుకెక్కనుంది. కాగా, ప్రభాస్​ 'రాధేశ్యామ్'​ ప్రమోషన్స్​లో భాగంగా దేశవ్యాప్తంగా ఆస్ట్రాలజీ కౌంటర్లను ఏర్పాటు చేసింది చిత్రబృందం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details