ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు@9pm

.

By

Published : May 29, 2020, 9:12 PM IST

ప్రధాన వార్తలు@9pm
ప్రధాన వార్తలు@9pm

  • మరో రెండు వారాలు పొడిగించారా?

దేశంలో లాక్​డౌన్​ పొడిగింపు విషయంలో ప్రధాని మోదీతో కేంద్ర హోంమంత్రి అమిత్​షా భేటీ అయ్యారు. ముఖ్యమంత్రుల అభిప్రాయాలను ఆయన ప్రధానికి వివరించారు. మరో రెండు వారాలు లాక్​డౌన్​ను పొడిగించాలని ప్రధాని నిర్ణయించారా? పూర్తి వివరాల కోసం క్లిక్ చెయ్యండి

  • మరికొన్ని మినహాయింపులు

రాష్ట్ర పరిధిలో ప్రజారవాణా వాహనాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆటోలు, కార్లు, ఇతర ప్రైవేటు వాహనాలకు లాక్​డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చింది. కంటైన్మెంట్ జోన్లు మినహా ఇతర ప్రాంతాల్లో ప్రయాణికులకు అనుమతినిచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చెయ్యండి

  • కరోనా రోగులను దుప్పట్లో

మహారాష్ట్ర నాసిక్​లోని ఓ ఆసుపత్రి సిబ్బంది నిర్వాకం చూసి జనాలు అవాక్కవుతున్నారు. ఆసుపత్రిలో లిఫ్ట్​ పనిచేయడం లేదని కరోనా రోగులను ఓ దుప్పటిలో పట్టుకొని మెట్లపై నుంచి మోసుకెళ్లారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చెయ్యండి

  • విమానాలకూ ముప్పు

మిడతలు తక్కువ ఎత్తులో ప్రయాణించటం వల్ల విమానాల టేకాఫ్, ల్యాండింగ్​లో సమస్యలు వస్తాయని డీజీసీఏ హెచ్చరించింది. ఇంజిన్లతో పాటు వివిధ భాగాల్లో ప్రవేశించే అవకాశం ఉందని వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చెయ్యండి

  • 'జోగి' ప్రస్థానం

ఛత్తీస్​గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్​ జోగి 74 ఏళ్ల వయస్సులో కన్నుమూశారు. మెకానికల్ ఇంజనీరింగ్​లో గోల్డ్ మెడలిస్ట్ అయిన ఆయనకు చదవడం, రాయడం అంటే ఇష్టం. లెక్చరర్​గా, కలెక్టర్​గా పనిచేసిన ఆయన రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చెయ్యండి

  • కొత్త జీవోలు

పీజీ మెడికల్, డెంటల్ కౌన్సెలింగ్​లో జీవో 43, 89లను ఏపీ ప్రభుత్వం సవరించింది. కొత్తగా జీవో 57, 58ను జారీ చేసింది. కొత్త జీవోల ప్రకారం.. మెరిటోరియస్ రిజర్వ్డ్ అభ్యర్థి స్లైడింగ్ విధానంలో వదులుకున్న సీట్లను తిరిగి అదే రిజర్వేషన్ కేటగిరీకి చెందిన అభ్యర్థికే కేటాయించేలా మార్పు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చెయ్యండి

  • రంగుల తొలగింపులో జాప్యం..

పంచాయతీ కార్యాలయాలకు వైకాపా రంగులు తొలగించడంలో జాప్యం చేసినందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని హైకోర్టుకు హాజరయ్యారు. రంగుల అంశంలో జీవో 623ని రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశామని, దానిపై విచారణ జరిగే అవకాశముందని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చెయ్యండి

  • భారీగా పడిపోయిన మౌలిక రంగాలు

కరోనా ప్రభావం మౌలిక రంగాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. లాక్​డౌన్​ వల్ల ఉత్పత్తి రికార్డు స్థాయిలో దిగజారింది. ఒక్క ఏప్రిల్​లోనే మౌలిక రంగాల ఉత్పత్తిలో 38.1శాతం క్షీణత నమోదైందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.పూర్తి వివరాల కోసం క్లిక్ చెయ్యండి

  • కెప్టెన్​గా గంగూలీ

టీమ్​ఇండియా సీనియర్ క్రికెటర్ శ్రీశాంత్ వన్డేల్లో అత్యుత్తమ ఆటగాళ్లతో ఓ జట్టును ప్రకటించాడు. ఈ జట్టుకు సౌరభ్ గంగూలీని కెప్టెన్​గా నియమించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చెయ్యండి

  • సోనూసూద్​ దాతృత్వం

లాక్​డౌన్​ కారణంగా కేరళలో ఇరుక్కుపోయిన ఒడిశాకు చెందిన 169 మందిని ప్రత్యేక విమానం ద్వారా వారి స్వరాష్ట్రానికి చేర్చారు బాలీవుడ్ ప్రముఖ నటుడు సోనూసూద్​. పూర్తి వివరాల కోసం క్లిక్ చెయ్యండి

ABOUT THE AUTHOR

...view details