ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @9PM

.

TOP NEWS
ప్రధాన వార్తలు @9PM

By

Published : Apr 23, 2022, 8:58 PM IST

  • సీఎం జగన్​కు చంద్రబాబు ఘాటు లేఖ
    మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఈ మేరకు సీఎం జగన్​కు లేఖ రాసిన చంద్రబాబు.. మహిళలపై హింస పెరిగేందుకు ప్రభుత్వ ఉదాసీన వైఖరే కారణమని దుయ్యబట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • నేనెవరికీ దత్తున్ని కాదు.. సొంతవాళ్లున్నారు : పవన్
    కౌలు రైతు సమస్యలపై మాట్లాడుతుంటే..వైకాపా నేతలు తనను దత్తపుత్రుడు అని అంటున్నారని జనసేన అధినేత పవన్ అన్నారు. ఏలూరు జిల్లా చింతపులపూడిలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన పవన్..పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • వివరణ ఇవ్వాల్సిందేనన్న వాసిరెడ్డి పద్మ
    తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు రాష్ట్ర మహిళా కమిషన్​ నోటీసులు ఇచ్చింది. చంద్రబాబు పేరుతో ఉన్న నోటీసు కాపీని తెదేపా పార్టీ కేంద్ర కార్యాలయ సిబ్బందికి అందజేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • పోలవరం ఎప్పటికి పూర్తి చేస్తామనేది పరిశీలించి చెబుతాం: అంబటి
    గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్ పాడైందని జలవనురల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. కాపర్ డ్యాం సగంలో ఉండగానే డయాఫ్రం వాల్ కట్టడం తప్పు అని వ్యాఖ్యానించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • మోదీ పర్యటనకు భద్రత కట్టుదిట్టం
    జమ్ముకశ్మీర్​లో మరో ఎన్​కౌంటర్ జరిగింది. కుల్గాం జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. ప్రధాని జమ్ముకశ్మీర్ పర్యటనకు ముందు ఆందోళనకర పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అధికారులు భద్రత కట్టుదిట్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'హైకోర్టుల్లో త్వరలోనే స్థానిక భాషల అమలు.. కానీ!'
    దేశంలోని వివిధ హైకోర్డుల్లో స్థానిక భాషలను ప్రవేశపెట్టటంపై కీలక వ్యాఖ్యలు చేశారు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎన్​.వి. రమణ. త్వరలోనే శాస్త్ర సృజనాత్మకత, కృత్రిమ మేధ ద్వారా అది సాధ్యమవుతుందని, కానీ, కొన్ని ప్రతిబంధకాలు ఉన్నాయని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'భారత్​కు విలువ ఇస్తాం.. ఆ విషయంలో మాత్రం ప్రోత్సహించలేం'
    భారత్- రష్యా మధ్య రక్షణ సహకారంపై అగ్రరాజ్యం అమెరికా కీలక ప్రకటన చేసింది. రక్షణ అవసరాల కోసం రష్యాపై ఆధారపడటాన్ని తాము ప్రోత్సహించడం లేదని పేర్కొంది. అదేసమయంలో.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • వినియోగదారులకు షాక్​.. ఆ కార్ల ధరలు మరింత ప్రియం
    ప్రయాణికుల వాహన ధరలను మరోసారి పెంచింది టాటా మోటార్స్​. నిర్వహణ వ్యయాలు, ముడిపదార్థాల ధరల పెరుగుదల వల్ల ఈ భారాన్ని వినియోగదారులపైకి బదిలీ చేయక తప్పడంలేదని పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • రెజ్లర్​ రవి దహియాకు గోల్డ్​.. పునియాకు సిల్వర్​
    ఆసియా రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో ఒలింపిక్స్ రజత పతక విజేత, భారత కుస్తీవీరుడు రవికుమార్‌ దహియా సత్తా చాటాడు. రెజ్లింగ్‌ 57 కిలోల పురుషుల ఫ్రీస్టైల్ విభాగంలో దహియా స్వర్ణ పతకం సాధించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • సామ్​ కొత్త మూవీ ట్రైలర్​ రిలీజ్..'కేజీయఫ్​ 2'పై చెర్రీ​ కామెంట్స్​
    టాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​ సమంత లేటెస్ట్​గా నటించిన 'కాతువాకుల రెండు కాదల్'​ సినిమా తెలుగు ట్రైలర్​ను మేకర్స్​ రిలీజ్​ చేశారు. మరోవైపు, కేజీయఫ్​2 సినిమాపై మెగా పవర్​ స్టార్​ రామ్​చరణ్​, బాలీవుడ్​ నటుడు సంజయ్​దత్​ ప్రశంసల జల్లు కురిపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details