ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 9 AM - ap top ten news

..

9AM TOP NEWS
ప్రధాన వార్తలు @ 9 AM

By

Published : Aug 5, 2022, 8:58 AM IST

  • 'చెత్త పన్నుపై ప్రజల్లో వ్యతిరేకత.. వసూళ్లు నిలిపేయండి'
    MLA Ravindranatha Reddy: ‘నగరపాలక, పురపాలక ఎన్నికలు అయిపోయాయి. ఇక ఎమ్మెల్యేలమైన మేము ఎన్నికలకు వెళ్లాల్సి ఉంది. క్లాప్‌ పథకం కింద సేవలు అందించకుండా మూడు, నాలుగు నెలల బకాయిలతో సహా చెత్తపన్ను వసూలు చేస్తుండడంతో నగర ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఆ వసూళ్లు నిలిపేయండి’ అని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి అన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • అక్రమ వసూళ్లలో పక్కా ‘ప్రణాళిక’.. ఏసీబీ తనిఖీల్లో బయటపడిన అవినీతి
    ACB raids: రోజురోజుకు అవినీతి, అక్రమాలపై ఫిర్యాదులు పెరుగుతుండటంతో అనిశా అధికారులు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించారు. ఎన్టీఆర్‌ జిల్లా నందిగామలో అక్రమ నిర్మాణాలపై ఆరోపణలు, ఫిర్యాదులు వెల్లువెత్తుతుండటంతో అధికారులు దాడులు నిర్వహించారు. దాదాపు 30మంది అధికారులు సోదాలు చేపట్టారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Varalakshmi Vratam Story : విశ్వమంతా లక్ష్మీమయం
    Varalakshmi Vratam Story : శ్రావణమాసమంటే మనందరికీ బోల్డంత ఇష్టం. పూజలూ పెళ్లిళ్లతో కళకళలాడుతుంది. అందునా ఈరోజు రెండో శుక్రవారం. నిన్ననే అవసరమైన సరంజామా అంతా తెచ్చేసి, శనగలు నానబెట్టేసి ఉంటారు. సంతోషంగా, సంబరంగా వ్రతం చేసుకునే ముందు వరలక్ష్మీ దేవి విశిష్టతను తెలుసుకుందాం.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Varalakshmi Vratham 2022: వరలక్ష్మి వ్రతం చేస్తున్నారా.. అయితే ఇవి తెలుసుకోవాల్సిందే!!
    Varalakshmi Vratham 2022: అలంకరణ అంటే అమ్మాయిలందరికీ ఎంత ఇష్టమో చెప్పనక్కర్లేదు. అందులోనూ సృజనాత్మకతను జోడిస్తూ మనసారా వేడుకుంటూ చేసే వరలక్ష్మీ వ్రతాల్లో ఆ అలంకరణే ప్రత్యేక ఆకర్షణ. సిరుల తల్లి కట్టూబొట్టూ, పెట్టే నైవేద్యాల దగ్గర్నుంచి పూజా సామగ్రి వరకూ ప్రతిదీ కొత్తగా ఉండాలనుకుంటారు. అలాంటి వారికోసం ఇప్పుడు శ్రావణ మాసపు అలంకరణలు బోలెడన్ని వచ్చేశాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • భారత్​లో ఎన్ని కోట్ల వాహనాలు ఉన్నాయో తెలుసా?
    దేశవ్యాప్తంగా ఎన్ని కోట్ల వాహనాలు ఉన్నాయి? అందులో బైక్​లు ఎన్ని? కార్లు ఎన్ని? ఈ ప్రశ్నలకు పార్లమెంటులో జవాబు ఇచ్చారు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • నదిలో చిక్కుకున్న వృద్ధ జంట.. తాళ్లతో కాపాడిన సహాయక సిబ్బంది
    తమిళనాడు ధర్మపురిలో ఓ వృద్ధ జంట కావేరి నదిలో చిక్కుకుపోయింది. అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. తాళ్ల సహాయంతో వాళ్లను రక్షించారు. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు డ్యాం గేట్లు ఎత్తివేయడం వల్ల కావేరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • అవమాన భారంతో చైనా.. మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా?
    World War 3 latest news : అమెరికా కాంగ్రెస్​ దిగువ సభ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ పర్యటన చైనాను తీవ్ర ఆగ్రహావేశాలకు గురిచేసింది. ఆంక్షలు, సైనిక విన్యాసాలు, క్షిపణుల ప్రయోగంతో ఇప్పటికే ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలకు కారణమైంది డ్రాగన్ ప్రభుత్వం. ఇది ఇంతటితో ఆగుతుందా? మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఉపఖండంలో తొలగని ఉద్రిక్తత.. 'పొరుగు'తో శాంతి నెలకొంటుందా?
    India relations with neighbouring countries : 2022... భారత్, పాకిస్థాన్​కు ఎంతో ప్రత్యేకం. రెండు దేశాలు తమ 75వ స్వాతంత్య్ర దినోత్సవాలను జరుపుకొంటున్నాయి. ఈ సమయంలో ఇటీవల వాఘాకు ఇరువైపులా కొన్ని సానుకూల వార్తలు వినిపిస్తున్నాయి. సరిహద్దులు దాటి ప్రజలు దగ్గరవుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • స్వదేశంలో కోర్టుల్లో గెలిచి.. విదేశంలో క్రీడల్లో విజేతగా నిలిచి..
    Tejaswin Shankar CWG 2022 : ఆ హైజంప్‌ అథ్లెట్‌ కామన్వెల్త్‌ క్రీడల అర్హత మార్కును అందుకున్నాడు.. ఇక క్రీడల్లో మంచి ప్రదర్శన దిశగా సన్నద్ధమవుతున్నాడు.. కానీ క్రీడల కోసం ఎంపిక చేసిన అథ్లెటిక్స్‌ బృందంలో చోటు దక్కలేదు. అంతర్‌ రాష్ట్ర పోటీలకు దూరంగా ఉన్నాడని అథ్లెటిక్స్‌ సమాఖ్య పక్కనపెట్టింది. కానీ పోరాటాన్ని నమ్ముకున్న అతను కోర్టుకెక్కాడు. ఆలస్యంగానైనా బర్మింగ్‌హామ్‌ చేరుకుని ఇప్పుడు చరిత్ర సృష్టించాడు. అతనే తేజస్విన్‌ శంకర్‌. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • జూనియర్ ఎన్టీఆర్​తో నటించడం నా డ్రీమ్​: జాన్వీ కపూర్
    JANVI KAPOOR JR NTR: అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలిగా వెండితెరకు పరిచయమైంది అందాల తార జాన్వీ కపూర్‌. తన మొదటి చిత్రం 'ధడక్‌'తోనే విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఉన్నది ఉన్నట్లు, సూటిగా మాట్లాడడం జాన్వీ నైజం. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన డ్రీమ్​ హీరో ఎవరో చెప్పింది. జూనియర్ ఎన్టీఆర్​తో నటించడం తన డ్రీమ్​ అని తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details