ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 9 AM - ap top ten news

..

9AM TOP NEWS
ప్రధాన వార్తలు @ 9 AM

By

Published : Jul 19, 2022, 8:59 AM IST

  • రేషన్‌ బండ్లతో సరఫరాకు ప్రజాధనం వృథా కాదా?.. తెచ్చుకోలేని స్థితిలో పేదలున్నారా?
    High court on ration: వాహనాల ద్వారా సరఫరాను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు.... రాష్ట్ర ప్రభుత్వానికి పలు ప్రశ్నలు వేసింది. పాఠశాలల విలీనం పేరుతో 3, 4, 5 తరగతుల విద్యార్థులు మూడు కిలోమీటర్ల దూరం వెళ్లి చదువుకోవాల్సిన పరిస్థితి కల్పిస్తున్న ప్రభుత్వం.... పక్కనే ఉన్న చౌకధరల దుకాణాలను కాదని వాహనాల ద్వారా ఇంటి వద్దే సరకులు ఇస్తామనడంలో హేతుబద్ధత ఏమిటని హైకోర్టు ప్రశ్నించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • గట్టు.. పట్టు తప్పుతోంది.. గోదావరి వరదలతో వెలుగు చూసిన డొల్లతనం
    Godavari: గోదావరి వరదలతో... డొల్లతనం బయటపడింది. ప్రవాహ వేగానికి కొన్నిచోట్ల గట్లపైనుంచి వరద పొంగిపొర్లుతూనే ఉంది. ఏటా జూన్‌, జులై, ఆగస్టులలో వచ్చే విపత్తులు, వరదలతో రైతులతోపాటు లోతట్టు ప్రాంతాలవారు బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వస్తోంది. గోదావరి వరద వేగానికి కాట్రేనికోన మండలం పళ్లంకుర్రు సమీపంలోని వృద్ధ గౌతమి ఏటిగట్టు బలహీనపడింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • పాఠశాలల విలీనంపై ఎమ్మెల్యేల లేఖల వెల్లువ
    పాఠశాలల విలీనం నిలిపివేయాలని మంత్రి బొత్స సత్యనారాయణకు 60 మంది ఎమ్మెల్యేలు లేఖలు రాశారు. స్కూళ్ల విలీనంపై ప్రజల నుంచి నిరసనలు వెల్లువెత్తున్నాయని... ఇది ఎన్నికలకు మంచిది కాదని పేర్కొన్నారు. విలీనం చేస్తామనడంతో కొందరు టీసీ ఇవ్వాలని, వేరే పాఠశాలలకు వెళ్తున్నారని తెలిపారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • దాడి ఘటనపై విచారణ జరిపించండి: లోక్‌సభ స్పీకర్‌కు సుబ్బారావు గుప్తా వినతి
    మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరులు దాడి చేశారని వైకాపా నాయకుడు సోమిశెట్టి సుబ్బారావు గుప్తా ఆరోపించారు. ఈ ఘటనపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు విన్నవించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • అరెస్టులపై స్టే విధించాలంటూ మరోసారి సుప్రీం మెట్లెక్కిన నుపుర్‌ శర్మ
    Nupur Sharma: వివాదాస్పద వ్యాఖ్యలతో సంచలం సృష్టించిన భాజపా మాజీ అధికార ప్రతినిధి నుపుర్‌ శర్మ మరోసారి సుప్రీంకోర్టు మెట్లెక్కారు. తన అరెస్టులపై స్టే విధించాలంటూ ధర్మాసనాన్ని కోరారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • రాష్ట్రపతి ఎన్నికల్లో భారీగా క్రాస్ ఓటింగ్.. ముర్ముకే జై!
    రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్​డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు అనుకూలంగా భారీగా క్రాస్‌ ఓటింగ్‌ జరిగినట్లు పలు రాష్ట్రాల శాసనసభ్యులు వెల్లడించారు. ఇప్పటికే ముర్ము విజయం ఖాయమనే వార్తలు వినిపిస్తుండగా... తాజాగా ఎమ్మెల్యేల వ్యాఖ్యలు ఎన్​డీఏ అభ్యర్థిని గెలుపునకు మరింత బలం చేకూర్చాయి. తమ పార్టీ విధానాన్ని ధిక్కరించి మరీ ముర్ముకు ఓటు వేసినట్లు పలువురు ఎమ్మెల్యేలు ప్రకటించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఐరోపాలో హీట్​వేవ్ బీభత్సం.. వేల ఎకరాలు దగ్ధం.. వెయ్యి మంది మృతి!
    వాతావరణంలో అనూహ్య మార్పుల వల్ల దక్షిణ ఐరోపాలో హీట్​వేవ్ ప్రభావం తీవ్రంగా ఉంది. ఉష్ణ గాలులు పెరగడంతో స్పెయిన్, గ్రీస్, ఫ్రాన్స్, పోర్చుగల్ దేశాల్లో కార్చిచ్చు రాజుకుంది. వేలాది ఎకరాలు అగ్నికి ఆహుతయ్యాయి. మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. హీట్‌వేవ్‌ కారణంగా స్పెయిన్‌, పోర్చుగల్‌లో వెయ్యి మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • భారీగా తగ్గిన వంట నూనెల ధరలు.. మరో 2-3 నెలల్లో ఇంకా కిందికి!
    edible oil price down: వంట నూనెల ధరలు మరోసారి తగ్గాయి. అంతర్జాతీయంగా ధరలు తగ్గినందున, ఆ ప్రయోజనాన్ని వినియోగదారులకు బదిలీ చేయాలని కేంద్రం ఆదేశించిన నేపథ్యంలో సంస్థలు చర్యలు ప్రారంభించాయి. ఫార్చూన్ బ్రాండ్​పై ఉత్పత్తులు విక్రయించే అదానీ విల్మర్​ రూ.30 మేర తగ్గించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • దశాబ్దాల కల నెరవేర్చి.. క్రికెట్​ పుట్టినింటికి కప్పు తెచ్చి..
    Ben stokes retires: క్రికెట్‌కు పుట్టినిల్లుగా చెప్పుకునే ఇంగ్లాండ్‌.. వన్డే ప్రపంచకప్‌ విజయం కోసం ఎంతో కాలం నిరీక్షించాల్సి వచ్చింది. 1975 మొదలు 2019కి ముందు మూడుసార్లు ఆ జట్టు ఫైనల్‌ చేరినా కప్పు కల తీరలేదు. చివరికి 2019లో విశ్వవిజేతగా నిలిచింది. ఫైనల్లో మొదట మ్యాచ్‌లో స్కోర్లు సమం.. ఆ తర్వాత సూపర్‌ ఓవర్లో స్కోర్లు సమం.. చివరకు బౌండరీల తేడాతో ఇంగ్లాండ్‌ గెలుపు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'నా కెరీర్​లో అదే ఫస్ట్​.. చైతూ ఇచ్చిన ఆ జర్క్ అస్సలు​ మర్చిపోలేను'
    నాగచైతన్య కథానాయకుడిగా విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'థ్యాంక్‌యూ'. రాశిఖన్నా, మాళవిక నాయర్‌ కథానాయికలు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు, శిరీష్‌ నిర్మిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details