- CORONA CASES RISING AGAIN IN AP: వణికిస్తున్న ఒమిక్రాన్.. క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు
రాష్ట్రంలో రోజురోజుకూ కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. వీటిలో అత్యధికం ఒమిక్రాన్ కేసులే ఉండటం ఆందోళనకరంగా మారింది. ఇటీవల పంపిన వంద నమూనాల్లో 80 ఒమిక్రాన్ వేరియంట్‌విగా తేలడం తీవ్రతకు అద్దం పడుతోంది. కేసుల పెరుగుదల దృష్ట్యా.. తగిన ఏర్పాట్లు చేయాలని ఉన్నతాధికారులు సిబ్బందిని ఆదేశించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- CM Jagan Tour In Guntur: నేడు గుంటూరులో సీఎం జగన్ పర్యటన
సీఎం జగన్.. ఈరోజు గుంటూరులో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా.. మంత్రులు సుచరిత, చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఏర్పాట్లను పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటన కారణంగా.. గుంటూరులో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని.. ప్రజలు నిర్దేశిత సమయంలో ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- Bifurcation Issue Meet: విభజన సమస్యలపై నేడు కీలక సమావేశం
విభజన సమస్యలపై నేడు కీలక సమావేశం జరగనుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య విభజన వివాదాలు సహా సంబంధిత అంశాలపై కేంద్ర హోంశాఖ చర్చించనుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో సమీక్షించనున్నారు. సింగరేణితో పాటు అనుబంధ సంస్థ ఆప్మెల్, విద్యుత్ బకాయిలు, దిల్లీలోని ఏపీ భవన్ విభజన, సంస్థల విభజన సహా ఇతర అంశాలు చర్చకు రానున్నాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- CHANDRABABU ON SAKSHI MEDIA: ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టకుండా రూ.1,200 కోట్ల సమీకరణ అవినీతి కాదా..?
సాక్షి మీడియా ఏర్పాటులో వాటాల విక్రయం మాటున జరిగిన ప్రక్రియను తెదేపా అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. ఇటువంటి చర్యలపై ఆదాయపన్ను శాఖ చర్యలు తీసుకోవాలని అన్నారు. అక్రమార్జనపై పన్ను కడితే.. అది సక్రమమౌతుందా అని ప్రశ్నించారు. వీటిని అరికట్టేందుకు చట్టాల్లో తగిన మార్పులు తీసుకురావాలని కోరారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- 'ఇష్టం లేని శృంగారాన్ని వద్దనే హక్కు 'ఆమె'కు ఉంటుంది'
పెళ్లయినా.. కాకున్నా.. ఇష్టం లేని శృంగారాన్ని నిరాకరించే హక్కు ప్రతి మహిళకు ఉంటుందని దిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. పెళ్లి చేసుకున్నంత మాత్రాన.. ఇష్టం లేని శృంగారాన్ని నిరాకరించే హక్కును మహిళలు కోల్పోతారా? అని ప్రశ్నించింది. వివాహితలు, అవివాహితల గౌరవాన్ని వేర్వేరుగా చూడలేమని పేర్కొంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- '20 రోజుల్లో 13 వేల మంది గూండాలు అరెస్టు'
సంఘ విద్రోహక శక్తులపై ఉక్కుపాదం మోపారు కేరళ పోలీసులు. రాష్ట్రవ్యాప్తంగా కేవలం 20 రోజుల వ్యవధిలో 13వేల మంది గూండాలను ఖైదు చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- 'అక్కడ చిన్నారులకు 100 శాతం వ్యాక్సినేషన్'
టీనేజర్లకు వంద శాతం టీకా వేసింది లక్షద్వీప్. రాష్ట్రాలు, కేంద్ర పాలితప్రాంతాల్లో ఈ ఘనత సాధించిన తొలి ప్రాంతంగా నిలిచింది.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- కివీస్‌కు ఇన్నింగ్స్ విజయం.. బంగ్లాతో టెస్టు సిరీస్ 1-1తో సమం
బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో న్యూజిలాండ్ విజయం సాధించింది. రెండు టెస్టుల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. మంగళవారం ముగిసిన ఈ మ్యాచ్‌లో కివీస్ ఇన్నింగ్స్, 117 పరుగుల ఆధిక్యంతో బంగ్లాపై విజయం సాధించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- India Open 2022: సింధు, శ్రీకాంత్ శుభారంభం
ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షెట్లర్స్ పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్ విజయంతో ప్రారంభించారు. మంగళవారం ప్రారంభమైన ఈ టోర్నీలో వీరిద్దరు ప్రిక్వార్టర్‌ఫైనల్లో అడుగుపెట్టారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- అంతా ఇక్కడికి వచ్చాకే నేర్చుకున్నా: నిధి అగర్వాల్
'హీరో' సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న నిధి అగర్వాల్.. చిత్ర విశేషాలతో పాటు తను చేస్తున్న కొత్త సినిమాల గురించి వెల్లడించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి