ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధానవార్తలు @9AM - ap news

.

ప్రధానవార్తలు @9AM
ప్రధానవార్తలు @9AM

By

Published : Oct 29, 2020, 9:01 AM IST

  • స్థానికంపై సమరం...కొత్త నోటిఫికేషన్​కు విపక్షాలు పట్టు

స్థానిక సంస్థల ఎన్నికలకు విపక్షాలన్నీ సై అంటుంటే ప్రభుత్వం, వైకాపా మాత్రం నై అంటున్నాయి. కరోనా మళ్లీ పెరగొచ్చని, ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సుముఖంగా లేదని ప్రభుత్వం స్పష్టం చేయగా ఇతర రాష్ట్రాల‌్లో పోలింగ్‌, ఏపీలో పరిస్థితిని అంచనా వేసి తుది నిర్ణయం తీసుకోవాలని విపక్షాలు కోరాయి. ఏకగ్రీవాలన్నీ రద్దుచేసి.. కొత్తగా నోటిఫికేషన్‌ ఇవ్వాలని విపక్షాలు డిమాండ్‌ చేశాయి. అన్నీ పరిశీలించాకే... ఓ నిర్ణయానికి వస్తామని ఎస్​ఈసీ స్పష్టం చేసింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • 'ఆ వెబ్‌సైట్లను బ్లాక్ చేయండి'... కేంద్ర మంత్రికి సీఎం జగన్ లేఖ

యువతను పక్కదోవ పట్టిస్తున్న ఆన్​లైన్ జూదం, బెట్టింగ్ వెబ్​సైట్లు, యాప్​లను ఏపీలో బ్లాక్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి జగన్ కోరారు. ఈ మేరకు కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు లేఖ రాశారు.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • ఎగువన వాడేస్తే.. మిగిలేదెక్కడ?

ఎగువ కేటాయింపుల మేరకు నీటిని వాడుకుంటే గోదావరిలో ఇక మిగులు జలాలు ఎక్కడుంటాయని ఏపీ ప్రశ్నిస్తోంది. గోదావరి - కావేరి అనుసంధానంపై జాతీయ జల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించనున్న వీడియో సమావేశంలో ఈ మేరకు వాదన వినిపించనుంది. ఈ సమావేశంలో భాగస్వామ్య రాష్ట్రాల నుంచి ఉన్నతాధికారులు, ప్రతినిధులు పాల్గొంటారు. కేంద్ర జల్‌శక్తి మంత్రి లేదా ఆ శాఖ సహాయ మంత్రి హాజరయ్యే అవకాశం ఉంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • 'సీబీఐ కేసులను ముందు విచారించండి'

జగన్​ అక్రమాస్తుల కేసుల వ్యవహారంపై సీబీఐ కోర్టులో బుధవారం విచారణ జరిగింది. జగన్​ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. సీబీఐ ఛార్జిషీట్లను తేల్చిన తర్వాతే ఈడీ కేసులపై విచారణ జరపాలని కోరారు. మద్యం సిండికేట్​ కేసులో అనిశా న్యాయస్థానం సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసింది. తదుపరి విచారణను నవంబర్ 2వ తేదీకి వాయిదా వేసింది.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • 'భారత్‌ను నమ్ముతాయి.. చైనాను కాదు'

భారత్​ - చైనా ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్రమంత్రి నితిన్​ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్​ ఎల్లప్పుడూ ప్రపంచ యోగ క్షేమాలను మాత్రమే కోరుకుంటుందని.. చైనాలాగా తన అధికార పరిధిని విస్తరించుకొనేందుకు ప్రయత్నించదని గడ్కరీ అన్నారు. 'రామ్‌ మందిర్‌ టు రాష్ట్ర మందిర్​' పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. మనదేశం ప్రపంచానికే మార్గదర్శకం అని కొనియాడారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • అవినీతిని అంతమొందించే బాధ్యత ప్రధానిపైనే!

స్వయం సమృద్ధ భారత్‌ లక్ష్యసాధనకు అవినీతి పెద్ద అవరోధంగా మారిందని ప్రధాని మోదీ ఆవేదన చెందారు. సర్వ శక్తులొడ్డి దానిపై పూర్తిస్థాయి యుద్ధం చేయాలని నిఘా వారోత్సవాల సందర్భంగా ఏర్పాటైన సదస్సులో ఉద్బోధించారు. అవినీతిపరుల పీచమణిచే సంస్థగా ఆవిర్భవించిన కేంద్ర నిఘా సంఘం ప్రభావశూన్యమైందని సుప్రీంకోర్టు అయిదేళ్ల క్రితమే చెప్పింది. ఎన్నికల్లో అక్రమ నగదు ప్రవాహం జోరుగా సాగుతోంది. ఈ పరిస్థితుల్లో ఈ దారుణ వ్యవస్థకు చికిత్స చేయాల్సిన బాధ్యత ప్రధాని మోదీపైనే ఉంది!పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • 'అమెరికా పొత్తు మంచిది కాదు- చైనాతో చర్చలు సాగించండి'

అమెరికాతో సైనిక పొత్తును కుదుర్చుకోవడం దేశ ప్రయోజనాలకు మంచిది కాదని వామపక్షాలు పేర్కొన్నాయి. అమెరికా భౌగోళిక రాజకీయ వ్యూహాల్లో పావుగా మారొద్దని కేంద్రానికి విజ్ఞప్తి చేశాయి. చైనాతో సరిహద్దు వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • 'భారత్ దాడి చేస్తుందని పాక్ ఆర్మీ చీఫ్ వణికిపోయారు'

గతేడాది ఫిబ్రవరిలో జరిగిన ఘటనను గుర్తు చేసుకున్నారు పాకిస్థాన్​లోని ఓ ప్రతిపక్ష నేత. వాయుసేన వింగ్​ కమాండర్​ అభినందన్​ వర్ధమాన్​ను పాక్​ నిర్బంధించినప్పుడు ఆ దేశ ఆర్మీ ఛీఫ్​ ఖమర్​ జావేద్​ బాజ్వా వణికిపోయారని అన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • అథ్లెట్​ 'కోల్‌మన్‌'పై రెండేళ్ల నిషేధం

100 మీటర్ల పరుగు ప్రపంచ ఛాంపియన్​ క్రిస్టియన్ కోల్​మన్​పై రెండేళ్ల నిషేధం విధించింది అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్. డోప్​ పరీక్షలకు డుమ్మా కొట్టిన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • సంక్రాంతికే సినిమా సందడి.. ఇప్పటికే బరిలో నాలుగు

కరోనా కల్లోలం చిత్రసీమని అతలాకుతలం చేసింది. ఈ ఏడాది వేసవి వినోదాలు పూర్తిగా తుడిచి పెట్టుకుపోయాయి. దసరా సరదాలే లేవు. దీపావళికైనా సినీ టపాసులు పేలతాయనుకుంటే అదీ కష్టంగానే ఉంది. ఇక అందరి దృష్టి రాబోయే సంక్రాంతిపైనే. ఆ లోపు పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయా? ప్రేక్షకులు థియేటర్లకి ఏ స్థాయిలో వస్తారు? ఇలా చాలా ప్రశ్నలు వేధిస్తున్నా సినీ వర్గాలు మాత్రం సంక్రాంతిపైనే ఆశలు పెట్టుకున్నాయి. వరుసగా విడుదల తేదీల్ని ప్రకటిస్తూ రేసుని షురూ చేశాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

ABOUT THE AUTHOR

...view details