- కేంద్రం కొర్రీపై నవంబరు 2న అత్యవసర భేటీ
పోలవరం నిధులపై కేంద్రం కొర్రీలతో ఆందోళన నెలకొన్న వేళ నవంబరు 2న పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అత్యవసర సమావేశం నిర్వహించనుంది. కేంద్రం ఆదేశాల మేరకు 2014 నాటి ధరలను ఆమోదించి పంపుతారా లేదా అనేది తేలిపోనుంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన వాదనలతో సిద్ధమవుతోంది. ప్రాజెక్టు అథారిటీ కేంద్రం చెప్పినట్లు నడుచుకోకుండా రాష్ట్ర ఆవేదనను ఏ మాత్రం అర్థం చేసుకుంటుందనేది అంతుచిక్కడంలేదు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
- జగన్ కేసులపై నేడు విచారణ
జగన్ అక్రమాస్తుల వ్యవహారంపై సీబీఐ నమోదు చేసిన కేసుల్లో అయిదింటిపై ఇవాళ విచారణ జరగనుంది. హైదరాబాద్లోని సీబీఐ కోర్టు ఈ కేసులపై విచారణ చేపట్టనుంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
- పైడితల్లి వేడుక...ఉత్తరాంధ్రకు పండుగ
విజయనగరానికి దసరా వచ్చిందంటే చాలు పండగ వాతావరణం నెలకొంటుంది. ఉత్తరాంధ్ర ఇలవేల్పుగా పూజలందుకుంటున్న పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరాలు దసరా నుంచి ఆరంభమవుతాయి. దసరా మొదలుకుని పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరం వరకు విజయనగరమంతా సర్వాంగ సుందరంగా సిద్ధమౌవుతుంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
- 'నేడు రైతుభరోసా రెండో విడత సాయం విడుదల'
రైతు భరోసా రెండో విడత కింద 2 వేల రూపాయలు చొప్పున పెట్టుబడి సాయాన్ని సీఎం జగన్ మంగళవారం విడుదల చేస్తారని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు వెల్లడించారు. ఆర్‌వోఎఫ్‌ఆర్ కింద పట్టాలు పొందిన గిరిజన రైతులకు 11,500 వేల రూపాయలు జమ అవుతాయని వివరించారు. మరోవైపు పోలవరానికి పూర్తి స్థాయి నిధులు ఇవ్వమని కేంద్రం చెప్పటానికి కారణం తెదేపానే అని మంత్రి కన్నబాబు ఆరోపించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
- రాజ్యసభ స్థానాలకు భాజపా అభ్యర్థులు ఖరారు
ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాల్లో ఎన్నిక కోసం భాజపా తమ అభ్యర్థులను ప్రకటించింది. యూపీ నుంచి 8 మందిని, ఉత్తరాఖండ్ నుంచి ఒక అభ్యర్థిని ప్రకటించింది. ఈ తొమ్మిది మంచి విజయం లాంఛనమేనని తెలుస్తోంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
- 9 గంటల విచారణలో టీ కూడా తీసుకోని మోదీ