ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9 am

.

9am news
9am news

By

Published : Jun 21, 2020, 9:19 AM IST

Updated : Jun 21, 2020, 9:31 AM IST

  • కరోనాను ఎదుర్కొనేందుకు యోగాసనాలు దోహదం:మోదీ

ఆరో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేళ.. ప్రపంచ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. ఇది దేశాల మధ్య సోదరభావం, సామరస్యం పెంపొందించేందుకు యోగా కృషి చేస్తోందన్నారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • డిజిటల్ ప్లాట్​ఫాంలో అంతర్జాతీయ యోగా డే వేడుకలు

ఆరో అంతర్జాతీయ 'యోగా డే' వేడుకలను ఆదివారం ప్రపంచమంతా ఘనంగా జరుపుకుంటున్నారు. అయితే ఈ సారి కరోనా కారణంగా వేడుకలను డిజిటల్ ప్లాట్​ఫాంలలో నిర్వహిస్తున్నారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • 18వేల ఎత్తులో ఐటీబీపీ సిబ్బంది యోగాసనాలు

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఇండో-టిబెటన్​ సరిహద్దు దళాలు 18 వేల అడుగుల ఎత్తులో యోగాసనాలు వేశారు. సున్నా డిగ్రీల సెల్సియన్​ ఉష్టోగ్రతను కూడా లెక్క చేయకుండా యోగా చేశారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • జమ్ముకశ్మీర్​లో ఎన్​కౌంటర్​.. ఉగ్రవాది హతం

జమ్ముకశ్మీర్​ షోపియాన్​లో​ ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన కాల్పుల్లో ఓ ముష్కరుడు హతమయ్యాడు. ఉగ్రవాదులు నక్కి ఉన్నారనే సమాచారంతో భద్రత దళాలు తనిఖీలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో సైనికులపై కాల్పులకు తెగబడ్డారు ముష్కరులు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • కరోనా వ్యాప్తి ప్రభావం: కృష్ణా నదిలో గ్రహణ స్నానాలు నిషేధం

కరోనా కట్టడి చర్యల్లో భాగంగా... కృష్ణా నదిలో గ్రహణ స్నానాలు నిషేధిస్తున్నట్టు విజయవాడ నగర పాలక సంస్థ ప్రకటన జారీ చేసింది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • రూ. 14 లక్షల విలువైన నిషేధిత గుట్కా, కైనీ ప్యాకెట్లు స్వాధీనం

పశ్చిమ గోదావరి జిల్లా సోమవరప్పాడులో రూ. 14లక్షల రూపాయల విలువచేసే గుట్కా, కైనీ బస్తాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • డిజిటల్​ తెరపై వెండితెర తారలు

మన వెండి తెర మద్దుగుమ్మలు డిజిటల్ థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. వారెవరో తెలుసుకుందామా? మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • 'భారత్​తో సిరీస్​ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా'

ఆస్ట్రేలియాలో భారత్​తో జరిగే టెస్టు సిరీస్​ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు ఆసీస్​ బ్యాట్స్​మన్​ స్టీవ్​​ స్మిత్​ అన్నాడు. భారత్​ మెరుగైన జట్టు అని అన్నాడు. మరోవైపు టీమ్​ఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లిపైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు స్మిత్​. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • గడువు ముగుస్తోంది.. ఈ పనులు పూర్తి చేశారా?

లాక్​డౌన్​తో ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి తప్పనిసరిగా పూర్తి చేయాల్సిన కొన్ని ఆర్థిక కార్యకలాపాలకు అడ్డంకి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఎవరికీ అసౌకర్యం కలగకుండా గడువు పెంచింది కేంద్రం. ఆ పనులు ఏమిటి? ఎప్పటిలోపు వాటిని పూర్తి చేయాలి అనే వివరాలు తెలుసుకోండి ఇప్పుడే. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

Last Updated : Jun 21, 2020, 9:31 AM IST

For All Latest Updates

TAGGED:

9am news

ABOUT THE AUTHOR

...view details