ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఏపీ, తెలంగాణల్లో 94% మంది విద్యార్థులకు 'స్మార్ట్‌ఫోనే' లేదు - online education in ap

ఆన్​లైన్ విద్యను అభ్యసించడానికి కావాల్సిన వ్యక్తిగత స్మార్ట్ ఫోన్లు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని 94 శాతం మంది విద్యార్థులకు లేవని తాజా సర్వేలో వెల్లడైంది. అలాంటివారికి ఆన్‌లైన్‌లో చదువులు కష్టమేనని సర్వే అభిప్రాయపడింది.

94% of students in andhrapradesh do not have a smartphone
ఆన్​లైన్ విద్య

By

Published : Aug 18, 2020, 8:03 AM IST

దక్షిణ భారతంలోని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని 94 శాతం మంది విద్యార్థులకు ఆన్‌లైన్‌ విద్యను అభ్యసించడానికి కావాల్సిన వ్యక్తిగత స్మార్ట్‌ ఫోన్లు లేవు. ఇంటర్నెట్‌ సౌకర్యమూ అందుబాటులో లేదు. తాజాగా బాలల హక్కుల సంఘం ‘క్రై’ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. మే-జూన్‌ నెలల్లో 11-18 సంవత్సరాల మధ్య ఉండే 5,987 విద్యార్థులతో ఆ సంస్థ ప్రతినిధులు మాట్లాడారు. కొవిడ్‌-19 కారణంగా పాఠశాలల మూతపడిన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ఆన్‌లైన్‌ విద్య ఎంత మందికి అందుబాటులో ఉందో.. వాస్తవాలు తెలుసుకునేందుకు ఆ సంస్థ సర్వే నిర్వహించింది. సర్వేలో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే కర్ణాటక పరిస్థితే గుడ్డిలో మెల్ల. ఆ రాష్ట్రం నుంచి స్పందించిన 1145 మంది విద్యార్థుల్లో తొమ్మిది శాతం మందికి వ్యక్తిగత స్మార్ట్‌ ఫోన్లు ఉన్నాయి. తమిళనాడులో అత్యల్పంగా మూడు శాతం మందికే ఈ ఫోన్‌ సౌకర్యం అందుబాటులో ఉంది. ఆందోళన కలిగించే విషయమేంటంటే సర్వే చేసిన విద్యార్థుల కుటుంబాల్లో 95 శాతం మంది వార్షిక ఆదాయం లక్ష కంటే తక్కువే. ఆ ఆదాయంతో వారు స్మార్ట్‌ఫోన్‌ కొనడం.. పిల్లలను ఆన్‌లైన్‌ చదివించడం కష్టమేనని సర్వే అభిప్రాయపడింది.

ABOUT THE AUTHOR

...view details