- కొత్తగా 5,983 కరోనా కేసులు, 11 మరణాలు
రాష్ట్రంలో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 35,040 మందికి కరోనా పరీక్షలు చేయగా.. కొత్తగా 5,983 కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి.. 11 మంది మృతి చెందారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- చలో విజయవాడకు ఆంక్షలు.. తగ్గేదేలే అంటున్న ఉద్యోగులు
రేపు 'చలో విజయవాడ' కు ప్రభుత్వ ఉద్యోగులు పిలుపునిచ్చిన నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు నగరంలో ఆంక్షలు విధించారు. గురువారం బీఆర్‌టీఎస్ రోడ్డుపై వాహన రాకపోకలను నిషేధిస్తున్నట్టు ప్రకటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- చర్చలతోనే సమస్యలు పరిష్కారం: చంద్రశేఖర్‌రెడ్డి
చలో విజయవాడపై ఉద్యోగ సంఘాలు పునరాలోచించాలని.. ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి కోరారు. మంత్రుల కమిటీ మంగళవారం స్టీరింగ్ కమిటీతో మాట్లాడిందని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- దేవాలయ భూములు.. ప్రభుత్వ భూములు కావు: ధర్మాన
శ్రీకాకుళంలో ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు కీలక వ్యాఖ్యలు చేశారు. దేవాలయ భూములు.. ప్రభుత్వ భూములు కావని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- అక్రమ సంబంధానికి యువకుడు బలి- 150 అడుగుల లోతులో శవం
అక్రమ సంబంధం కారణంగా ఓ యువకుడ్ని ఇద్దరు స్నేహితులే హత్య చేశారు. 150 అడుగుల లోతులో శవాన్ని పోలీసులు వెలికితీశారు. ఈ దారుణ ఘటన యూపీ మథురలో జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పసిపాపను రూ.5వేలకు అమ్మేసిన తల్లి
పిల్లలకు సరైన తిండి అయినా పెట్టలేనంత పేదరికం.. ఇల్లు లేక రాత్రిళ్లు, శీతాకాలం చలిలోనే గజగజలాడుతూ గడపాల్సిన దుస్థితి.. శరీరాన్ని గుల్ల చేస్తున్న రోగానికి తగిన చికిత్స పొందలేని పరిస్థితి.. అన్నీ కలిసి ఓ తల్లి పేగు బంధం తెంచుకునేందుకు కారణమయ్యాయి. పసిబిడ్డను రూ.5వేలకు అమ్ముకునేలా చేశాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- బడ్జెట్ అండతో రెండో రోజూ బుల్ జోరు.. సెన్సెక్స్ 696 ప్లస్
బడ్జెట్ సానుకూల ప్రభావంతో స్టాక్ మార్కెట్లు బుధవారం కూడా జోరు ప్రదర్శించాయి. సెన్సెక్స్ 696 పాయింట్లు, నిఫ్టీ 203 పాయింట్లు వృద్ధి చెందాయి. ఇండస్ఇండ్, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు 5శాతానికిపైగా లాభపడ్డాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- నీరజ్ చోప్డా ఖాతాలో మరో ఘనత
టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రోలో సత్తాచాటి దేశానికి స్వర్ణం అందించిన యువఅథ్లెట్ నీరజ్ చోప్డాకు అరుదైన ఘనత దక్కింది. ప్రతిష్ఠాత్మక లారియూస్ వరల్డ్ బ్రేక్ త్రూ అవార్డుకు నామినేట్ అయిన ఆరుగురు ఆటగాళ్లలో స్థానం సంపాదించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఆ ఒక్క పరుగుతో కివీస్ ఆటగాడికి ఐసీసీ అవార్డు!
లక్ష్య ఛేదనలో ప్రతి పరుగూ జట్టుకు కీలకమే. కానీ న్యూజిలాండ్‌కు చెందిన ఆటగాడు ఆ సమయంలో ఒక పరుగు తీయబోయి వెనక్కు తగ్గాడు. ఈ చర్యకు అందరూ ప్రశంసలు కురింపించారు. అంతేకాదు..ఐసీసీ అవార్డును కూడా బహుకరించింది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కరోనా కరుణిస్తే మా సినిమా రిలీజ్: 'పక్కా కమర్షియల్' టీమ్
సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో పక్కా కమర్షియల్, కాతువక్కుల రెండు కాదల్, డీజే టిల్లు, అనేక్, ఖిలాడి, ఇళయారాజా కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన సంగతులు ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ప్రధాన వార్తలు @7PM