ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @7PM - AP NEWS LIVE UPDATES

.

7pm Top news
ప్రధాన వార్తలు @7pm

By

Published : Dec 28, 2021, 7:00 PM IST

  • బెయిల్‌పై ఉన్న నేతలు ఎప్పుడైనా జైలుకు వెళ్లవచ్చు: ప్రకాశ్​ జవదేకర్
    ఏపీలో చాలామంది నేతలు బెయిల్‌పై ఉన్నారని.. వాళ్లు ఎప్పుడైనా జైలుకు వెళ్లవచ్చని కేంద్ర మాజీ మంత్రి, భాజపా సీనియర్‌ నేత ప్రకాశ్‌ జావడేకర్‌ అన్నారు. వైకాపా, తెదేపా, తెరాస.. మూడూ కుటుంబ పార్టీలే... ఈ 3 ప్రాంతీయ పార్టీలు అవినీతికి పాల్పడుతున్నాయని ప్రకాశ్‌ జావడేకర్‌ ఆరోపించారు.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ప్రభుత్వ రాబడి తగ్గినా ఏ సంక్షేమ పథకం ఆపలేదు - సీఎం జగన్
    రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు వర్తింపజేయనున్నట్లు సీఎం జగన్ స్పష్టం చేశారు. పథకం అమలు చేసినపుడు ఏవైనా కారణాలతో లబ్ధి పొందని వారికి ఏటా జూన్, డిసెంబర్ నెలల్లో ఎంపిక చేసి లబ్ధి చేకూర్చనున్నట్లు తెలిపారు.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • రాష్ట్రంలో కొత్తగా 141 కరోనా కేసులు.. ఇద్దరు మృతి
    రాష్ట్రంలో కొత్తగా 141 కొవిడ్ కేసులు నమోదు కాగా.. ఇద్దరు మరణించారు. ప్రస్తుతం 1,073 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • నియంత్రించాల్సింది నిత్యావసరాల ధరలు..సినిమా టిక్కెట్ల ధరలు కాదు: రామకృష్ణ
    కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు దళితుల సంక్షేమాన్ని విస్మరించాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి సామాజిక న్యాయాన్ని విస్మరించారన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • మోదీ భద్రతకు రూ.12కోట్ల సూపర్​ స్ట్రాంగ్​​ కార్​
    ప్రధాని నరేంద్ర మోదీ భద్రతకు రూ.12కోట్ల ఖరీదైన 'మెర్సిడీస్‌-మేబాక్​ ఎస్‌-650 గార్డ్‌'ను వినియోగిస్తున్నారు. సాయుధ దాడుల నుంచి ఈ కారు బలమైన రక్షణ ఇస్తుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'ప్రికాషన్​ డోసు కోసం వారికి ఆ సర్టిఫికెట్​ అవసరం లేదు'
    60ఏళ్ల వయసుదాటి ఇతరత్రా ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి జనవరి 10 నుంచి భారత్​లో ప్రికాషన్​ డోసు అందించనున్నారు. అయితే అనారోగ్య సమస్యలు ఉన్నాయనే ధ్రువీకరణ పత్రం లేకున్నా టీకా వేయనున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • పోలీసుల దాడిపై వైద్యుల నిరసన.. క్యాంపస్​లో మళ్లీ ఉద్రిక్తత!
    రెసిడెంట్ డాక్టర్ల ర్యాలీపై పోలీసుల దాడులను నిరసిస్తూ దిల్లీ ఎయిమ్స్​లో వైద్యులు ఆందోళన చేపట్టారు. ర్యాలీ నిర్వహించడానికి సిద్ధమవగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • కార్లలో కరోనా పరీక్షలకు.. ఆస్పత్రుల వద్ద భారీ క్యూ
    అమెరికాలో కరోనా ఉద్ధృతి తీవ్రస్థాయికి చేరింది. కొవిడ్​ కేసులు రోజుకు రెండు లక్షలకు పైగా నమోదవుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఇంగ్లాండ్​పై ఆసీస్ విజయం.. రికార్డులే రికార్డులు!
    యాషెస్ సిరీస్​ మూడో టెస్టులో ఘోర పరాజయం పాలైంది ఇంగ్లాండ్. తద్వారా సిరీస్​ను కైవసం చేసుకుంది ఆస్ట్రేలియా. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్​ ద్వారా నమోదైన రికార్డులపై ఓ లుక్కేద్దాం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • కన్నీరు పెట్టుకున్న బన్నీ, సుకుమార్​​
    'పుష్ప' థ్యాంక్స్ ​మీట్​లో ఐకాన్​స్టార్​ అల్లుఅర్జున్​.. దర్శకుడు సుకుమార్​తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ​ కంటతడి పెట్టారు. బన్నీ మాటలతో సుకుమార్​ కూడా ఉద్వేగానికి లోనయ్యారు.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details