- హీరో ఎలక్ట్రిక్ షోరూంలో అగ్ని ప్రమాదం
విశాఖ గాజువాకలోని హీరో ఎలక్ట్రిక్ షోరూంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో చెలరేగిన మంటల్లో 15 బైక్‌లు దగ్ధమయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు: మంత్రి వెల్లంపల్లి
ఇంద్రకీలాద్రికి వచ్చే భవానీ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా.. దీక్షా విరమణ ఏర్పాట్లు చేయనున్నట్లు దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- తెలుగు భాషను బూతులమయంగా మార్చిన ఘనత వైకాపాదే: వర్ల రామయ్య
బూతులను అసెంబ్లీ నుంచి పార్లమెంట్‌కు తీసుకువెళ్లిన ఘనత వైకాపా ఎంపీలకే దక్కిందని తెదేపా నేత వర్ల రామయ్య అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'డ్రిప్ పథకం కింద శ్రీశైలం, సాగర్‌కు మరమ్మతులు చేయాలి'
డ్రిప్ పథకం కింద శ్రీశైలం, సాగర్‌కు మరమ్మతులు చేయాలని కేంద్రాన్ని కోరినట్లు నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు స్పష్టం చేశారు. సరైన కాలంలో మరమ్మతుల వల్ల రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- చిన్నారిపై అత్యాచారం.. నెలరోజుల్లో 'ఉరి' తీర్పు!
గత నెలలో రెండున్నరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య ఘటనలో 35 ఏళ్ల వ్యక్తికి మరణశిక్ష విధించింది గుజరాత్ పోక్సో కోర్టు. తీర్పు సందర్భంగా ఇది 'అరుదైన' కేసు అని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రజనీకాంత్‌ను కలిసిన శశికళ- కారణం ఇదే!
అన్నాడీఎంకే మాజీ నేత, జయలలిత నెచ్చెలి వీకే శశికళ రజనీకాంత్‌ను ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నందుకు సూపర్‌స్టార్‌ను అభినందించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ద్విచక్రవాహనం పేలి నలుగురు మృతి
ద్విచక్రవాహనం పేలి నలుగురు మరణించారు. మరో నలుగురు గాయపడ్డారు. ఈ ఘటన ఇరాక్‌లోని బస్రా నగరంలో జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఫోక్స్‌వ్యాగన్ న్యూ టైగూన్ వచ్చేసింది
జర్మనీకి చెందిన ఆటోమొబైల్ దిగ్గజం ఫోక్స్ వ్యాగన్ భారత మార్కెట్లో టైగూన్ యూవీ కార్‌ను మంగళవారం విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.31.99 లక్షలుగా నిర్ణయించింది. ఈ కార్కు సంబంధించిన బుకింగ్స్ కూడా మంగళవారంతో ప్రారంభంకానున్నట్లు సంస్థ తెలిపింది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఐసీసీ 'ప్లేయర్ ఆఫ్ ది మంత్' రేసులో వీరే!
నవంబర్ నెలకు సంబంధించి 'ప్లేయర్ ఆఫ్ ది మంత్' నామినేషన్లను ప్రకటించింది ఐసీసీ. ఈ జాబితాలో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్, పాకిస్థాన్ ఆటగాడు అబిద్ అలీ ఉన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'సిరివెన్నెల' చివరిగీతం విడుదల.. 'శ్యామ్ సింగరాయ్'లో..
దివంగత సిరివెన్నెల సీతారామశాస్త్రి ప్రాణం పోసిన ఆఖరి పాట విడుదలైంది. నాని నటించిన 'శ్యామ్ సింగరాయ్' కోసం ఈ పాటను రాశారు సిరివెన్నెల. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ప్రధాన వార్తలు