ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @7PM - trending news

.

ప్రధాన వార్తలు @7PM
ప్రధాన వార్తలు @7PM

By

Published : Dec 1, 2021, 7:13 PM IST

  • TTD EO TO PILGRIMS: తిరుమ‌ల‌కు వెళ్లేందుకు భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందీ లేదు: ఈవో

TTD EO TO PILGRIMS: తిరుమల రెండవ కనుమదారిలో కొండచరియలు విరిగిపడినప్పటికీ.. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేదని తితిదే ఈవో జ‌వ‌హ‌ర్‌రెడ్డి తెలిపారు. ఘాట్ రోడ్లలో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు అధికారులు చర్యలు తీసుకుంటున్నారని ఆయన స్పష్టం చేశారు.

  • Andhra Pradesh Corona Cases: రాష్ట్రంలో కొత్తగా 184 కరోనా కేసులు

Corona Cases in AP: రాష్ట్రంలో కొత్తగా 184 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. వైరస్ బారిన పడి ఒకరు మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2149 యాక్టివ్ కేసులున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

  • Electricity meter readers protest: మంత్రి బాలినేని ఇంటి ముట్టిడించిన విద్యుత్ మీటర్ రీడర్లు

విద్యుత్ శాఖ మంత్రి బాలినేని ఇంటిని విద్యుత్ మీటర్ రీడర్ లు ముట్టడించారు. వేతన బకాయిలు చెల్లించటంతో పాటు కొందరిని ఉద్యోగాల నుంచి తొలగించటంపై ఆందోళన వ్యక్తం చేశారు.

  • CM Jagan ordered to stand by sirivennela family: సిరివెన్నెల కుటుంబానికి స్థలాన్ని కేటాయించాలి.. సీఎం జగన్ ఆదేశం

CM Jagan ordered to stand by sirivennela family: ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కుటుంబానికి అండగా నిలవాలని.. ఆయన కుటుంబానికి స్థలాన్ని ఇచ్చేలా పరిశీలన చేయాలని.. సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఆసుపత్రి ఖర్చు భారం.. ఆయన కుటుంబంపై పడకుండా చూడాలని ఆదేశించారు.

  • రాజస్థాన్​లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం యూపీలో నిరసన- ఎందుకిలా?

Unemployed youth protest: నిరుద్యోగ యువకుల నిరసన రాష్ట్ర సరిహద్దులు దాటింది. 49 రోజులుగా ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని.. పక్క రాష్ట్రానికి వెళ్లి నిరసన చేపట్టారు యువకులు.

  • ఫోర్బ్స్​ అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాలో ఆశావర్కర్​

Forbes India W Power 2021: ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ అత్యంత​ శక్తిమంతమైన మహిళల జాబితాలో ఈ ఏడాది ఒడిశాకు చెందిన ఓ గిరిజన మహిళ స్థానం సంపాదించారు. ఆశావర్కర్​గా పనిచేస్తున్న 45 ఏళ్ల మతిల్దా తన గ్రామంలో ముఢనమ్మకాలు, కరోనాపై అవగాహనకు విశేష కృషి చేశారు. అంతేకాదు.. గ్రామంలో దాదాపు వేయిమందికి పైగా జనాభా ఉండగా, ఆమె ఒక్కరే వారందరి బాగోగులు చూస్తారు.

  • 'దేశంలో యూపీఏ కూటమే లేదు.. ప్రత్యామ్నాయం అవసరం'

దేశంలో యూపీఏ కూటమి లేదని బంగాల్ సీఎం మమతా బెనర్జీ పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో భాజపాకు ప్రత్యామ్నాయం అవసరమని చెప్పారు.

  • అక్టోబర్​లోనే 'ఒమిక్రాన్​' వ్యాప్తి- ఆ దేశాల్లో తొలి కేసు

ఒమిక్రాన్​.. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కొత్త రకం. దక్షిణాఫ్రికా కొత్త వేరియంట్​పై సమాచారం ఇచ్చే వరకు ఎవరికీ తెలియదు. కానీ, ఈ వైరస్​ వ్యాప్తి అక్టోబర్​లోనే ప్రారంభమైనట్లు స్పష్టమవుతోంది. నైజీరియాలో అక్టోబర్​లో సేకరించిన నమూనాల్లో కొత్త వేరియంట్​ బయటపడింది.

  • IPL Retention 2022: 'ఆరెంజ్ ఆర్మీ'కి రుణపడి ఉంటా: రషీద్

IPL Retention 2022: ఐపీఎల్-2022 రిటెన్షన్​ ప్రక్రియలో రషీద్​ ఖాన్​ను వదులుకుంది సన్​రైజర్స్ హైదరాబాద్. ఈ విషయంపై స్పందిస్తూ.. తనను ఇంతకాలం ప్రోత్సహించిన యాజమాన్యానికి, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడీ అఫ్గాన్ స్పిన్నర్.

  • 'లక్ష్య' ట్రైలర్.. 'పుష్పక విమానం' ఓటీటీ రిలీజ్ డేట్

Lakshya Movie Trailer: టాలీవుడ్​కు సంబంధించిన కొత్త చిత్రాల కబుర్లు వచ్చేశాయి. ఇందులో 'లక్ష్య', 'మడ్డీ' ట్రైలర్​తో పాటు 'పుష్పక విమానం' ఓటీటీ రిలీజ్​ డేట్​కు సంబంధించిన వివరాలు ఉన్నాయి.

ABOUT THE AUTHOR

...view details