ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @7PM - తెలుగు తాజా వార్తలు

.

7pm Top news
ప్రధాన వార్తలు @7PM

By

Published : Nov 30, 2021, 7:01 PM IST

  • 'సిరివెన్నెల' అస్తమయం.. సినీప్రముఖుల నివాళులు

సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతితో తెలుగు చిత్రసీమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతి పట్ల సినీప్రముఖులు విచారం వ్యక్తం చేస్తూ సామాజిక మాధ్యమాల ద్వారా నివాళులు అర్పిస్తున్నారు. ఎవరెవరు ఏమన్నారంటే.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • సంస్కరణలతో విద్యా వ్యవస్థను పటిష్టం చేశాం: మంత్రి సురేశ్

పరిపాలన, సంక్షేమం,అభివృద్ధిలో ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేక ముద్ర వేశారని మంత్రి సురేశ్ అన్నారు. సంస్కరణలతో విద్యావ్యవస్థను సీఎం జగన్ పటిష్టం చేశారని చెప్పారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను తెదేపా అడ్డుకుంటోందని విమర్శించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • రాజధాని అమరావతి అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది: సోము

రాజధాని అమరావతి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. నిధుల కోసం రాష్ట్ర ఆస్తులను కాకుండా...సీఎం జగన్‌ తన సొంత ఆస్తులను తాకట్టు పెట్టాలని హితవు పలికారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • హరితపన్ను, డీజిల్​ పై పన్నులు తగ్గించాలి: లారీ యజమానుల సంఘం

కరోనా కారణంగా రాష్ట్రంలో రవాణా రంగం తీవ్ర ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని.. లారీ యజమానుల సంఘం తెలిపింది. రవాణా వాహనాలపై హరితపన్ను, డీజిల్​ పై పన్నులు తగ్గించి.. రవాణా రంగాన్ని ఆదుకోవాలని లారీ యజమానుల సంఘం.. సీఎం జగన్​కు లేఖ రాశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • రాష్ట్రంలో 184 కరోనా కేసులు.. ముగ్గురు మృతి

రాష్ట్రంలో కొత్తగా 184 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి ముగ్గురు మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,149 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • అసెంబ్లీ ఆవరణలో మద్యం సీసాలు.. సీఎం ఛాంబర్​కు దగ్గర్లోనే!

శాసనసభ ప్రాంగణంలో ఖాళీ మద్యం సీసాలు కనిపించడం కలకలం సృష్టించింది. బిహార్​లో ఈ ఘటన జరిగింది. దీనిపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • కుమారుడి కోసం చిరుతతో తల్లి వీరోచిత పోరాటం

దేవుడు అందరినీ రక్షించలేక అమ్మను సృష్టించాడని అంటారు. ఇది సరిగ్గా సరిపోతుంది మధ్యప్రదేశ్​లో బైగా గిరిజన తెగకు చెందిన ఓ మహిళకు. కుమారుడి కోసం అత్యంత ధైర్యసాహసాలను ప్రదర్శించింది ఆ తల్లి. చిరుతతో పోరాడి బిడ్డను రక్షించుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • గనిలో చిక్కుకున్న కూలీలు- 96 గంటలు నాన్​స్టాప్​గా తవ్వి బయటకు!

Bokaro Mine: ఓ బొగ్గు గనిలో చిక్కుకున్న నలుగురు కార్మికులు 96 గంటల పాటు నిర్విరామంగా తవ్వి ప్రాణాలను కాపాడుకున్నారు. ఎన్డీఆర్​ఎఫ్​, పోలీసులు సాయం అందించలేకపోయినా వారే స్వయంగా గని నుంచి బయటపడ్డారు. ఝార్ఖండ్​ బొకారో బొగ్గు గనిలో ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • క్యూ2​లో జీడీపీ వృద్ధి రేటు 8.4 శాతం

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో దేశ జీడీపీ 8.4 శాతం వృద్ధి చెందింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఇక మళ్లీ క్రికెట్ ఆడతానో లేదో అనుకున్నా: అశ్విన్

న్యూజిలాండ్​తో జరిగిన తొలి టెస్టులో టీమ్ఇండియా స్పిన్నర్ అశ్విన్ ఓ ఘనత సాధించాడు. భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా రికార్డు నెలకొల్పి హర్భజన్‌సింగ్‌ (417)ను అధిగమించాడు. ఈ నేపథ్యంలోనే స్పందించిన అశ్విన్.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details