- ఈనెల 19 నాటికి మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
ఈనెల 19నాటికి మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అల్పపీడన ప్రభావంతో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- నీట్ పరీక్ష ఫలితాలు విడుదల
దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను జాతీయ పరీక్షల ఏజెన్సీ (ఎన్‌టీఏ) శుక్రవారం సాయంత్రం విడుదల చేసింది. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో (2020-21) ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 13న జాతీయ అర్హత ప్రవేశపరీక్ష (నీట్) నిర్వహించారు. ఈ పరీక్షకు 14.37లక్షల మందికి పైగా (90శాతం మంది) హజరయ్యారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- 'ఉన్మాద చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు
విజయవాడలో ప్రేమోన్మాది ఘాతుకం చాలా బాధాకరమని డీజీపీ గౌతం సవాంగ్ పేర్కొన్నారు. ఉన్మాద చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. సీపీ స్వీయ పర్యవేక్షణలో విచారణ జరిగేలా ఆదేశాలు జారీచేశామన్న డీజీపీ... 'దిశ' స్ఫూర్తిగా ఏడు రోజుల్లో ఛార్జిషీట్ దాఖలు చేస్తామని చెప్పారు.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- దుప్పిని చుట్టి ప్రాణం తీసిన కొండచిలువ
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం కళ్యాణిడ్యామ్ సమీపంలోని ఫిల్టర్ హౌస్ వద్ద కొండచిలువ దుప్పిని చుట్టుముట్టి ప్రాణం తీసింది. దాన్ని మింగేందుకు విఫలయత్నం చేసి, ఫలితం లేకపోవడంతో అడవిలోకి వెళ్ళిపోయింది. ఆ ప్రాంతంలో ఉన్న పశువుల కాపరులు ఈ దృశ్యాలను తమ చరవాణుల్లో చిత్రీకరించారు.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- నిండుకుండల్లా జలాశయాలు
కృష్ణా బేసిన్లో వరద ప్రవాహం కొనసాగుతోంది. జలాశయాలు నిండుకుండల్లా మారాయి. భారీ వరదల కారణంగా.. ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులించింతల ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేశారు.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- భారత్లో కనిష్ఠానికి కరోనా మరణాల రేటు